అందరి బాటలో నడిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకత ఏముంటుంది? అందరూ చేసే పనినే భిన్నంగా.. తనదైన మార్క్ ఉండేలా చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. వాస్తు మొదలు పలు నమ్మకాల్ని విపరీతంగా నమ్మే ఆయన.. తాజాగా హరితహారం పేరిట భారీగా మొక్కల్ని తెలంగాణ వ్యాప్తంగా నాటే పని పెట్టుకున్న సంగతి తెలిసిందే.
రికార్డు స్థాయిలో కోట్లాది మొక్కల్ని వారాల వ్యవధిలో నాటాలన్న లక్ష్యం పెట్టుకోవటమే కాదు.. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లకు పైనే ఖర్చు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. వందల కోట్లు ఖర్చు అయినా.. ఆయన చెప్పినట్లుగా.. గ్రీన్ బెల్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఎంతోకొంత వృద్ధి చెందినా.. చేసిన ఖర్చుకు ఫలితం లభించినట్లే.
ఇదిలా ఉంటే మొక్కల్ని నాటే విషయంలో ఎక్కడి శాస్త్రమో కానీ కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కేసీఆర్. ప్రతి వ్యక్తి జన్మనక్షత్రం.. వారి రాశికి తగిన మొక్కను ఎంపిక చేసుకొని నాటితే బాగుంటుందన్న సూచన చేశారు. తాను చెప్పిన మాటలకు తగ్గట్లే కేసీఆర్ ఫ్యామిలీ తమ రాశి.. జన్మనక్షత్రాలకు తగిన మొక్కల్ని ఎంపిక చేసుకొని నాటారు. బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
మరి.. కేసీఆర్ ఫ్యామిలీ నాటిన మొక్కల లెక్క చూస్తే..
సీఎం కేసీఆర్
రాశి కర్కాటకం కాగా.. ఆయన ఎంపిక చేసుకున్న మొక్క మోదుగ. ఇక.. ఆయన జన్మనక్షత్రం అశ్లేష కావటంతో పొన్న మొక్కనూ నాటారు
సీఎం కేసీఆర్ సతీమణి శోభ
రాశి ధనస్సు కాగా.. ఆమెకు తగిన మొక్క రావి. ఇక.. ఆమె జన్మనక్షత్రం ఉత్తరాభాద్ర.. దీంతో ఆమెకు సరిపోయే పొన్న మొక్కనూ నాటారు
మంత్రి కేటీఆర్
రాశి మకరం కాగా.. ఆయనకు తగిన మొక్క జిట్రేగి. ఆయన జన్మనక్షత్రం శ్రావణం కావటంతో జిల్లేడు మొక్కనూ నాటారు
కేటీఆర్ సతీమణి శైలిమ
రాశి మీనం కాగా.. ఆమెకు తగిన చెట్టు మర్రి. జన్మనక్షత్రం రేవతి కావటంతో ఇప్ప మొక్కను నాటారు
కేటీఆర్ కుమారుడు హిమాన్షు
రాశి సింహం కాగా.. తగిన మొక్క రేగు. జన్మనక్షత్రం పూర్వాషాడ కావటంతో సీత అశోక మొక్కను నాటారు
కేటీఆర్ కుమార్తె అలేఖ్య
రాశి తుల కాగా.. తగిన మొక్క పొగడ. జన్మనక్షత్రం స్వాతి కావటంతో తెల్లమద్ది మొక్కను నాటారు.