కేసీఆర్ అంటే ఖావో కమిషన్ ఆవ్ అని భాష్యం చెప్తూ తనను విమర్శించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి - గులాబీ దళపతి కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాహుల్ తోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగిపోయేలా విమర్శలతో వాయించారు. కాంగ్రెస్ అధ్యక్షుణ్ని జోకర్ గా అభివర్ణించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఆయన చదివారంటూ ఎద్దేవా చేశారు. కమీషన్ల బతుకు రాహుల్ దేనంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు - కొత్తగూడె - మణుగూరు - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు - భూపాలపల్లి - పెద్దపల్లి జిల్లాలోని మంథని - పెద్దపల్లిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. రాహుల్ గాంధీపై ఈ ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులపై రాహుల్ కారుకూతలు కూశారని ఆరోపించారు. టీఆర్ ఎస్ ది కమీషన్ల ప్రభుత్వమని సొల్లు ఆరోపణలు చేస్తూ ఆయన జోకర్ లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. నిజానికి కమీషన్ల కక్కుర్తి చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులు మింగింది ఆయన కుటుంబమేనని ఆరోపించారు.
తెలంగాణపై - టీఆర్ ఎస్ ప్రభుత్వంపై రాహుల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. ఉప్పిడుండి - ఉపాసముండి - అటుకులు తినుకుంటూ పేగులు తెగేదాక కోట్లాడి తాము ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గుర్తుచేశారు. అలాంటి తమను ఇష్టం వచ్చినట్లు తిడితే సహింపబోమని స్పష్టం చేశారు. ఏనాడూ రైతులు - ప్రజా సంక్షేమం గురించి ఆలోచించని రాహుల్ గాంధీ.. రైక గాంధీ.. తోక గాంధీ.. పచ్చి అబద్ధాలు చెప్తే తెలంగాణ సమాజం ఊరుకోబోదన్నారు.
కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. వాళ్లకు మెదడు తక్కువగా ఉంటుందని ఎద్దేవా చేశారు. 58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ - టీడీపీలు తెలంగాణలో పూర్తిగా జీవన విధ్వంసానికి పాల్పడ్డాయని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు అక్రమంగా పొత్తులు పెట్టుకుని సిగ్గు లేకుండా ఓట్లడిగేందుకు వస్తున్నాయని విమర్శించారు. టీడీపీ - కాంగ్రెస్ లు హిమాలయాలకు వెళ్లి ఏమైనా ఆకుపసరు తాగి పునీతమయ్యాయా అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ - బీజేపీ రెండూ దరిద్రపుగొట్టు పార్టీలేనని గులాబీ దళపతి విమర్శించారు.