కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఏదో ఒక మర్మం ఉంటుంది. ఉత్తి పుణ్యానికే ఆయన మాట్లాడరు. తాజాగా జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే అంశం కానీ..ఆ దిశగా అడుగులు పడే పరిస్థితి లేదు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థలో పెద్ద వార్త వచ్చింది.అందులోని సారాంశం ప్రకారం.. పలువురు టీఆర్ఎస్ నేతలతోనూ షర్మిల వర్గీయులు చర్చలు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
మరి.. ఆ కథనంలో నిజం ఉందా? లేదంటే.. మరింకేదైనా కారణం ఉందా? అన్న సందేహాలకు తెర తీసేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టటం అంత తేలికైన విషయం కాదని చెబుతూనే.. అలా ప్రయత్నాలతో ఎంత నష్టమన్న విషయాన్ని ఒక ఉదాహరణతో చెప్పటం గమనార్హం. కొత్త పార్టీ ఏర్పాటు.. అందులోని సాధకబాధకాలను ప్రస్తావించారు.
‘కొత్త పార్టీ పెట్టటం అంత ఈజీనా? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? పార్టీని నడపడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు, ఆట పాటలతో పార్టీలు నడవవు. నాయకత్వానికి ఎంతో పట్టుదల, నిబద్ధత ఉంటేనే మనుగడ సాగిస్తది. గతంలో కొందరు నేతలు 12 పార్టీలు పెట్టి నానా అవస్థలు పడినా చివరి వరకు కొనసాగలే. నరేంద్ర - విజయశాంతి - దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు. 1985లో టీడీపీ తరఫున నేను సిద్దిపేట నుంచి, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచాం. కొన్నాళ్లకు జానారెడ్డి - కేఈ కృష్ణమూర్తి తదితరులతో కలిసి రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ చేరారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్ కూడా రాలేదు. దాంతో ఆయన తెరమరుగయ్యారు. రామచంద్రారెడ్డి కోసం సిద్ధిపేటలో ఇటీవల నేనే ఇంటి స్థలం ఇప్పించి.. నిర్మాణానికి ఆర్థికసాయం కూడా చేశాను. రాంగ్ ట్రాక్ లో వెళితే ఇలాగే ఉంటుంది. రామచంద్రారెడ్డి మంచివాడైనా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు..?