కొన్ని రంగాల మీద అదే పనిగా విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికొన్ని వాటి విషయంలో మాత్రం చర్యల కత్తి దూసేందుకు పెద్దగా ఇష్టపడరు. కరోనా వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆసుపత్రుల మీద తీవ్ర విమర్శలు.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మరీ.. బరితెగించిన రెండు మూడు ఆసుపత్రుల మీద తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారే కానీ.. తప్పు చేయాలంటే వణికే పరిస్థితిని మాత్రం తీసుకురాలేదు. అదేంటే.. కరోనా వేళలో ఆసుపత్రుల మీద చర్యలు తీసుకుంటే.. వైద్యం ఎవరు చేస్తారు? అన్న ప్రశ్నలే తప్పించి.. సామాన్యులకు తగిలే షాకుల సంగతేమిటి? అన్నది ప్రశ్నే.
ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడిన ఆసుపత్రుల నుంచి ముక్కుపిండి మరీ వారు వసూలు చేసిన అదనపు మొత్తాల్ని వెనక్కి ఇప్పిస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించినప్పటికీ.. అలాంటివి ఇప్పటివరకు ఎన్ని జరిగాయి? ఎంతమందికి ఆసుపత్రులు మింగేసిన డబ్బులు ఇప్పించారన్న వివరాల్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది.
ఆసుపత్రుల సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు స్కూళ్ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. కరోనా వేళలో.. క్లాసులు నిర్వహించకుండా ఆన్ లైన్ లోనే క్లాసులు చెబుతున్నప్పటికి.. ఫీజుల జులుం మాత్రం భారీగా నడుస్తోంది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పినా.. ఇప్పటికి పలు స్కూళ్లు తమ తీరును మార్చుకోవటం లేదు. ఇలాంటివేళ.. గతంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను కొనసాగిస్తున్నట్లుగా తాజాగా జీవో 75ను విడుదల చేశారు.
తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో కీలక అంశాల్ని చూస్తే.. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని.. అంతకుమించిన మరేమీ వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు స్కూళ్లు తమ పంథాను మార్చుకోవాలని స్పష్టం చేసింది. వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చే బదులు తోక జాడిస్తున్న స్కూళ్ల అనుమతులు రద్దు చేసి.. అందులో చదువుతున్న విద్యార్థుల్ని వేరే స్కూళ్లకు మార్చటం లాంటి పని చేస్తే.. ప్రభుత్వం చేసే హెచ్చరికలకు అంతో ఇంతో అర్థం ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్ద ఎప్పటికి గమనిస్తారన్నది అసలు ప్రశ్న.