ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారు. దళితబంధు ప్రాజెక్టు కోసం తాజాగా మరో రూ.500 కోట్ల రూపాయలను హుజూరాబాద్ ప్రజల నెత్తిన పోశారు. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే తొలి విడతగా రూ.500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ లో మొత్తం దళితబంధుకు వెయ్యికోట్లు కేటాయించింది. వారంలో మరో వెయ్యి కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీఅవుతోంది.
దళితబంధు అమలును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే హుజూరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షలు నేరుగా ప్రభుత్వం ఇచ్చింది. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు చూపుతోంది.
దళితబంధు అనేది ఒక ఉద్యమం అని.. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామని సీఎం అంటున్నారు.
దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలువనుందన్నారు. దేశంలోని దళితులందరికీ ఆర్థిక, సామాజిక విపక్షాల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సీఎం ఆకాంక్షించారు.