సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ రివ్యూ మారథాన్ ఒక కొలిక్కి వచ్చేసింది. గంటల పాటు సాగిన సమీక్ష సారాంశాన్ని ప్రెస్ నోట్ రూపంలో వెల్లడించిన సీఎంవో.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. హైదరాబాద్ మహా నగరం మినహా రాష్ట్రంలో మరెక్కడా యాక్టివ్ కేసులు లేవని తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ మహానగరంలోనూ నాలుగు జోన్లలో తప్పించి మాయదారి రోగం జాడలు లేవన్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్.. మలక్ పేట.. చార్మినార్.. కార్వాన్ జోన్లలోనే యాక్టివ్ కేసులు ఉన్నాయని.. జిల్లాలకు చెందిన (యాదాద్రి భువనగిరి.. జనగామ.. మంచిర్యాల) చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకిందన్న ఆయన.. ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్ కేసులు లేవని చెప్పారు. సదరు జిల్లాలకు చెందిన వలస కూలీలకు హైదరాబాద్ లో వైద్యం చేస్తున్న నేపథ్యంలో.. ఆ జిల్లాల్లోనూ కేసులు లేవన్నారు.
మొత్తంగా.. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరంలోని నాలుగు జోన్ల మినహా మరెక్కడా యాక్టివ్ కేసులు లేవని చెప్పటం ద్వారా.. మాయదారి రోగంపై సాగుతున్న పోరులో కేసీఆర్ కొంతమేర విజయం సాధించినట్లేనన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనల్ని యథాతధంగా అమలు చేస్తున్నామని.. సాయంత్రం ఏడు గంటల తర్వాత కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని.. వైరస్ సోకిన వారు కోలుకుంటున్న వారే ఎక్కువన్న అభయాన్ని సారు ఇచ్చేశారు. చూస్తుంటే.. లాక్ డౌన్ 4.0లో చాలా వరకు వాణిజ్య.. వ్యాపార సంస్థల్ని ఓపెన్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా సీఎంవో పంపిన ప్రెస్ నోట్ ను చూస్తుంటే అర్థమవుతుందని చెప్పాలి.