గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. విచారణ విషయలో మెతక వైఖరి అవలంబించిన అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించిన కేసీఆర్ ఈ క్రమంలో తన పార్టీ వైపు దృష్టిసారించారని తెలుస్తోంది. వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకుల్లో - టీఆర్ ఎస్ లోని పలువురి పేర్లు నయీం ఎపిసోడ్ లో వినిపించి నేపథ్యంలో సొంత పార్టీ నేతలపై చర్యలకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. నయీం కేసులో మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్సీలు - ఇద్దరు ఎమ్మెల్యేలు - 21 మంది పోలీసు అధికారుల పాత్ర ఉందని సిట్ నిగ్గుతేల్చింది. ఇందుకు సంబంధించిన సిట్ నివేదిక సీఎం కేసీఆర్ చేతికి చేరింది. ఈ నేపథ్యంలో వారిపై వేటుకు సిద్దమైనట్లు సమాచారం.
నయీం వ్యవహారాన్ని ఇన్ ఫార్మర్ - గ్యాంగ్ స్టర్ కోణాల్లో నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఇన్ ఫార్మర్ వ్యవహారంతో సంబంధమున్న వారికి ఊరటనిచ్చి.. గ్యాంగ్ స్టర్ నయీంను వాడుకున్న వారిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. ముందుగా ఊహించిన విధంగానే ముందుగా రాజకీయ నాయకుల నుంచే చర్యలు ప్రారంభం కానున్నాయి. సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటే మిగతా వారిపై చర్యలు తీసుకోవడం సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిట్ విస్తరణ కొనసాగిందని కూడా తెలుస్తోంది. సిట్ విస్తరణ వెనుక బలమైన కారణం ఉందని - నయీం కేసుని సత్వరమే నిగ్గుదేలాలన్న సంకల్పం దాగుందన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గణేశ్ నిమజ్జనం తరువాతే కీలక పరిణామాలు చోటు చేసుకునే ఆస్కారం ఉందని సమాచారం.