తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన తెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శలు చేయటానికి ప్రత్యర్థి పార్టీ నేతలే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి. అలాంటిది కేసీఆర్ సొంత పార్టీ నేతలు ఆయన్ను తిట్టే అవకాశం ఉందా? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. కడుపు మంట ఒక గులాబీ ఎమ్మెల్యే చేత ఆలాంటి మాటల్ని అనిపించేలా చేసిందన్నది ఇప్పుడా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ లాంటి నేతను ప్రతిపక్షపార్టీలో నోరు మెదపటానికి ఆచితూచి అడుగులేస్తుంటే.. సొంత పార్టీకి చెందిన ఒక నోటిదురుసు ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా తిట్టేయటం.. కేసీఆర్ తో పాటు.. ఆయన కుటుంబ సభ్యుల పైనా ఫైర్ కావటం సంచలనం సృష్టిస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక స్థానంలో అభ్యర్థికి టిక్కెట్టు ఖరారు కోసం ప్రయత్నించాడు. అదే స్థానానికి మరో గులాబీ ఎమ్మెల్యే ట్రై చేశారు. ఈ సందర్భంలో కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చెప్పిన అభ్యర్థికే టిక్కెట్టు కన్ ఫర్మ్ అన్న మాట వినిపించిన నేపథ్యంలో పస్ట్రేషన్ కు గురైన సదరు ఎమ్మెల్యే ఫోన్లో తిట్టేశాడట. అయితే.. తిట్ల కాల్ ను రికార్డు చేసిన ఒకరు.. దాన్ని కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి ఇవ్వటం.. అది కాస్త కేసీఆర్ ను కలిసి.. ఆయనకు వినిపించటంతో బాస్ సీరియస్ అయ్యాడట.
తనపైనా.. తన ఫ్యామిలీ మెంబర్ల మీద నోరు జారిన సదరు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చేలా.. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థికే టిక్కెట్టు కన్ ఫర్మ్ చేశారట. దీంతో.. నోరు పారేసుకున్న సదరు ఎమ్మెల్యే.. ఇప్పుడు మరింతగా చెలరేగిపోతున్నారట.ఇలాంటి నోటి దురుసు ఎమ్మెల్యేలకు గ్రేటర్ ఎన్నికల తర్వాత షాక్ తప్పదన్న మాట వినిపిస్తోంది. సదరు ఎమ్మెల్యే పేరు బయటకు చెప్పని పార్టీ నేతలు.. సదరు నేతకు సంబంధించి ఒక క్లూ ఇస్తున్నారు. తన నోటి దురుసుతనంతో గతంలోనూ అవకాశాలు మిస్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరంటారు..?