పట్టు వచ్చిన వేళలో మరింత పట్టు బిగించే దోరణిని కొందరు ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అదే తీరును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో కొందరు మంత్రుల పని తీరు విషయంలో అసంతృప్తి ఉందన్న విషయాన్ని తాజాగా ఆయన బయటపెట్టినట్లుగా తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణకు అనుసరించిన పద్దతులపై ఇప్పటివరకూ నోరు విప్పని ఆయన.. తాజాగా తనకు సన్నిహితంగా ఉండే వారి వద్ద ఓపెన్ అయినట్లుగా చెబుతున్నారు. తాజాగా విస్తరణ చేపట్టిన నేపథ్యంలో మంత్రులతో భేటీ అయిన కేసీఆర్..ఈ సందర్భంగా గత మంత్రివర్గంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.
మంత్రులకు అలసత్వం అస్సలు పనికి రాదని.. నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న ఆయన కొత్త మంత్రివర్గాన్ని అన్ని రకాల సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకొనే ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు..కొత్త మంత్రులకు ఒక కొత్త మంత్రాన్ని పాఠించాలన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రులు పెదవి విప్పకూడదని.. తనతో భేటీ అయిన సందర్భంగా జరిగే అంశాలతో పాటు.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాల్ని బయటకు పొక్కనీయకూడదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది,
మౌనాన్ని ఆశ్రయించాలని.. అంతకు మించిన ఉత్తమమైన మార్గం మరొకటి లేదన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రతి విషయం మీదా గుట్టు పాటించటం ముఖ్యమని.. ఏ విషయాన్ని బయటకు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రుల మీదనేనని.. అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. కేసీఆర్ చెప్పిన మౌన మంత్రాన్ని కొత్త మంత్రులు పక్కా పాటిస్తారనటంలో మరెలాంటి సందేహాలు అక్కర్లేదేమో?