మాటల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోటీ పడగలరా? ఎప్పుడేం మాట్లాడాలో అది మాట్లాడినా.. మాట్లాడకున్నా.. అందుకు తగ్గ జస్టిఫికేషన్ ఇచ్చే విషయంలో మాత్రం ఆయన మొనగాడనే చెప్పాలి. ఒక వ్యక్తి.. అందునా రాజకీయాల్లో ఉండి.. భారీ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మాట్లాడే మాటల్లో తప్పులు దొర్లవా? అంటే ఖాయమనుకుంటాం.
కానీ.. కేసీఆర్ ట్రాక్ రికార్డు చూడండి. ఆయన మాటలు మంట పుట్టిస్తాయి? కానీ.. వ్యవస్థలు అభ్యంతరం పెట్టే పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. కాకుంటే.. ఈ మధ్యన కరీంనగర్ ఎన్నికల సభలో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ తనకు అలవాటైన ధోరణిలో మాట్లాడిన కేసీఆర్ మాటలు సంచలనంగా మారాయి.
దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలకు సంబంధించిన వీడియో క్లిప్ బ్రహ్మాండంగా వైరల్ అయ్యింది. ఈ ఇష్యూపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏమైందో ఏమో కానీ.. కంప్లైంట్ చేసిన దాదాపు రెండు వారాల తర్వాత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.
దీనికి స్పందించిన కేసీఆర్.. ఈసీ నిర్దేశించిన గడువు లోపు తన వివరణకు వారికి అందించారు. తన మాటల్ని కేసీఆర్ ఎలా సర్ది చెప్పుకున్నారో చూస్తే.. ఆయన తెలివికి మురిసిపోవాల్సిందే. తాను హిందువులను కించపరిచేలా మాట్లాడలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు. తప్పుగా అర్థం చేసుకొని ఫిర్యాదు చేశారంటూ క్లారిటీ ఇచ్చిన కేసీఆర్.. తాను ఎన్నికల కోడ్.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు. తన ప్రసంగం పూర్తిగా వింటే.. భారత రాజ్యాంగానికి ప్రాథమిక నిర్మాణమైన లౌకికవాదం.. ప్రజాస్వామ్యం ప్రతిబింబించేలా ఉందని వివరణ ఇచ్చారు. మరి.. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.