రాహుల్‌ తో ఆడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం

Update: 2018-08-12 16:58 GMT
రాజకీయ శత్రుత్వం ఎంత వరకైనా వెళ్లేలా చేస్తుందట. ఇప్పుడు తెలంగాణలో పాలక టీఆరెస్ పార్టీ కాంగ్రెస్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే టీఆరెస్‌ కు ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఆ పార్టీ అధినేత - ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్ కాంగ్రెస్ - ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆ పార్టీ నేతల ఆరోపణ. తమ పార్టీ అధినేత హైదరాబాద్ వస్తుంటే ప్రభుత్వం ఆటంకాలు కలిగించడం తగదని అంటున్నారు.
   
రాహుల్ గాంధీని ఒక ఎంపీ - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తీవ్రవాదుల చేతిలో హత్యకు గురైనా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడిగానైనా ఆయనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర పోలీసులతో ఆయనకు భద్రత కల్పించాలని.. తెలంగాణ రాష్ట్ర అతిథి గృహంలో ఆయనకు వసతి కల్పించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ... తెలంగాణ ప్రభుత్వం తీరు చూస్తుంటే మాత్రం.. ఆ వస్తే రానీ - ఏంటట అన్నట్లుగా ఉండడంతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
   
తెలంగాణ పర్యటక శాఖ నిర్వహించే హోటల్ ప్లాజాలో రాహుల్‌ కు వసతి కావాలంటూ కాంగ్రెస్ నేతలు వళ్లి కోరగా నిబంధనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటూ వాయిదా వేశారు. అయితే.. కాంగ్రెస్ నేతలు పదేపదే కోరడంతో ప్రభుత్వం అక్కడ వసతి కల్పించడానికి అంగీకరించినా అక్కడ గదుల అద్దె ఎంతో అదంతా చెల్లించి ఉండొచ్చని చెప్పిందట. దీంతో కాంగ్రెస్ నేతలు అంగీకరించి అక్కడ రూం అద్దెకు తీసుకున్నారు. రాహుల్ గాంధీ వంటి వీఐపీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
Tags:    

Similar News