గ్రేటర్ పీఠం పై కేసీఆర్ ధీమా..105 డివిజన్లలో విజయం తథ్యం అంటూ జోస్యం!

Update: 2020-11-18 17:20 GMT
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ ‌ఎంసీ) ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. జీహెచ్ ‌ఎంసీ ఎన్నికలపై ఎవ్వరి అంచనాలు వారికున్నాయి. మళ్లీ జీహెచ్ ‌ఎంసీ పీఠాన్ని అధిష్టించాలని అధికార టీఆర్ ఎస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే దుబ్బాక ఫలితాన్ని గ్రేటర్ లో చూపించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. ఇదిలా ఉంటే , గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసదే విజయం అని ,105 స్థానాల్లో టిఆర్ ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, విజయం ఖాయమన్న భావన లో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించరాదని సీఎం క్యాడర్‌ ను హెచ్చరించారు.

బుధవారం తెలంగాణభవన్ ‌లో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని, ప్రచారాంశాలను పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమేనని ఘంటాపథంగా చాటారు. టీఆర్ ఎస్ పార్టీకి 105 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ప్రచారంశాలపై వ్యూహాలను వివరించిన సీఎం ఎల్ ఐ సీ, బీఎస్ ఎం ఎల్ ‌లను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతోందని, ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు వివరించడం ద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే కరోనా ను ఏ విధంగా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదో ప్రజలకి వివరించాలని అన్నారు.

జీహెచ్ ఎం సీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు. నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం ,అన్ని గ్రంథాలయాల ఆధునికీకరణ ,రూ. 130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు, నగరమంతా ఉచిత వైఫై సదుపాయం, రూ. 1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్ , మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక.
Tags:    

Similar News