తెలంగాణ భవన్ లో పురపాలక ఎన్నికల కసరత్తుపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అందరూ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భం గా మున్సిపల్ ఎన్నికల కసరత్తు పై కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.
కేసీఆర్ ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకెవరు పోటీ కారని.. అభ్యర్థులను గెలిపించి తీసుకురండి’ అంటూ ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. 90శాతానికి పైగా సీట్లను టీఆర్ఎస్ గెలవబోతోందని అంటూ ఉత్సాహపరిచారు. గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనంటూ స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల కార్యక్షేత్రం లో ఉన్నది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని.. ఎవరూ మనకు పోటీకారని.. పోటీకి రాలేరని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు.. పార్టీకి వ్యతిరేకంగా మారే రెబల్స్ పై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పార్టీ టికెట్ల కోసం డిమాండ్ బాగా ఉందని.. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించాలని సూచించారు.