కేసీఆర్ జాదూ ఎంతంటే.. మోడీనే ప్లాట్!

Update: 2017-04-26 05:23 GMT
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల మాయాజాలం ఎంత‌లా ఉంటుందో తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆయ‌న్నువిప‌రీతంగా వ్య‌తిరేకించే వారు సైతం.. ఆయ‌న మాట‌ల‌కు క‌న్వీన్స్ కావాల్సిందే. ఆయ‌న మాట‌లు విన్న వారంతా మంత్ర‌ముగ్దులు కావాల్సిందే. ఆయ‌న వాద‌న‌కు అవున‌నాల్సిందే. ఇలాంటి మేజిక్‌నే తాజాగా మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చెప్పిన మాట‌ల‌కు.. అంత పెద్ద ప్రధాని న‌రేంద్ర మోడీ మొద‌లు.. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులే కాదు.. నీతి అయోగ్ స‌భ్యులు సైతం ఫ్లాట్ అయిపోయిన‌ట్లుగా చెప్పాలి.

నీతిఅయోగ్ స‌మావేశానికి హాజ‌రైన ముఖ్య‌మంత్రుల్లో కేసీఆర్ ఒక‌రు. అయితే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతో పోలిస్తే.. మోడీ అండ్ కో మ‌న‌సుల్ని దోచుకున్న వారిలో కేసీఆర్ ముందుంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేంద్రం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని భావిస్తున్న జీఎస్టీ బిల్లును తొలిసారి ఆమోదించిన స్టేట్ గా తెలంగాణ ప్ర‌ధాని మ‌దిలో రిజిస్ట‌ర్ కావ‌ట‌మే కాదు.. మిగిలిన రాష్ట్రాలు తెలంగాణ‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్న కితాబును సొంతం చేసుకోవ‌టం విశేషం.

అంతేకాదు.. రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఉచిత ఎరువుల ప‌థ‌కానికి కూడా భారీ ఎత్తున ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. రైతుల‌కు ఇప్ప‌టికే ప‌లురాష్ట్రాలు అమ‌లు చేస్తున్న రుణ‌మాఫీతో పోలిస్తే.. ఇదే మంచిద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఉచిత ఎరువుల ప‌థ‌కాన్ని నీతి అయోగ్ స‌భ్యుడు ర‌మేశ్ చంద్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌ట‌మే కాదు.. రైతుల‌కు పెట్టుబ‌డి వ్య‌యాన్ని త‌గ్గించే చ‌ర్య‌లు చేప్ట‌ట‌టం మంచిద‌ని చెప్ప‌టమే కాదు.. రుణ‌మాఫీలు ఇవ్వాల‌నుకుంటున్న వారు.. అందుకు బ‌దులుగా ఎరువుల్నిఉచితంగా ఇవ్వ‌టం మంచిద‌న్న సూచ‌న‌ను చేశారు.

ముఖ్యంగా క‌ర‌వు పీడిత ప్రాంతాల్లో ఉచిత ఎరువుల ప‌థ‌కం స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. రైతుల మీద నుంచి పెట్టుబ‌డి భారాన్ని త‌గ్గించి.. ఒత్తిడి లేకుండా చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. నీతిఅయోగ్ మూడేళ్ల కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించేందుకు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యాల్ని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌టం గ‌మ‌నార్హం. రైతుల‌కు రుణ‌మాఫీ ఇవ్వ‌టం కంటే.. వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి త‌గ్గించేలా ఎరువుల్ని ఉచితంగా అందించ‌టం.. సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తేవ‌టం మంచిద‌న్నారు. రాయితీపై వ్య‌వ‌సాయ ప‌నిముట్ల‌ను అంద‌జేయాల‌న్న ఆయ‌న‌.. రుణ‌మాఫీ స‌రికాద‌ని తేల్చి చెప్పారు.

రుణ‌మాఫీని అమ‌లు చేస్తే.. అప్ప‌టికే రుణాన్ని చెల్లించిన వారు న‌ష్ట‌పోతార‌ని.. ఎగ్గొట్ట‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న వారు లాభ ప‌డ‌తార‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. మాఫీ కంటే తిరిగి చెల్లించే సామ‌ర్థ్యాన్ని రైతుల్లో పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేసీఆర్ అమ‌లు చేస్తున్న.. చేయాల‌నుకుంటున్న ప‌థ‌కాల్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన నీతి అయోగ్ స‌భ్యుడి మాట‌లు.. మోడీ ప‌రివారం మీద ఎంత ప్ర‌భావాన్ని చూపించాయో ఇట్టే తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News