పరిపాలన వ్యవహారాల్లో కీలకమైన ఆర్థిక వ్యవహారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డమ్మీ చేసేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బడ్జెట్ కు ముందు కసరత్తులు- కేటాయింపులు - ప్రాధాన్యతల దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ ముఖ్యమంత్రి ముద్రే స్పష్టంగా కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విపక్షాలు వివరిస్తున్నాయి. ఈటెల జోక్యం - ప్రమేయం లేకుండానే బడ్జెట్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని, రాష్ట్ర ఆర్థికశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ పరిభ్రమిస్తున్నదని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక - హోంశాఖలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిలో ఆర్థికం మరింత ప్రాధాన్యత గల శాఖ అయినప్పటికీ కేసీఆర్ తన హస్తగతం చేసుకున్నారని అంటున్నారు.
ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు - కార్యక్రమాల నిర్వహణలో ఆర్థిక శాఖది కీలక పాత్ర. అందువల్లే ఆర్థిక మంత్రి చుట్టూ మిగతా శాఖలు - వాటి ఉన్నతాధికారులు చక్కర్లు కొడుతుంటారు. గతంలో ఇలా ఆర్థికమంత్రి కార్యాలయం కిటకిటలాడితే...ఇపుడు ఇందుకు భిన్నంగా ఆర్థిక మంత్రి కార్యాలయం మారిందని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విత్తమంత్రి కార్యాలయం కేవలం సందర్శకులు - పార్టీ నాయకుల హడావుడికే పరిమితమవుతోందే తప్ప అక్కడ కీలక నిర్ణయాలేవీ జరగటం లేదని అంటున్నారు. మరోవైపు బడ్జెట్ కసరత్తుల నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి భేటీ కావాల్సి ఉంటుంది. తద్వారా ఆయా శాఖల ప్రాధాన్యతలను అంచనా వేసుకుని బడ్జెట్ కూర్పు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు బడ్జెట్ సమీక్షలన్నీ సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. అధికారులే బడ్జెట్ కసరత్తులో నిమగమయ్యారు. తమ శాఖలకు చెందిన ప్రతిపాదనలు కూడా మంత్రులు ఆర్థికశాఖ అధికారులకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసింది. ఆయా శాఖలకు సంబంధించి ముఖ్యమైన పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయింపులు చేశారని తెలుస్తోంది. సాగునీటిశాఖ - యూనివర్సిటీలు - సంక్షేమం - విద్యుత్తు - వ్యవసాయం వంటి వాటికి ముఖ్యమంత్రే కేటాయింపులు సూచిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఆర్థిక మంత్రి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ధనిక రాష్ట్రం - మిగులు రాష్ట్రమనే ప్రకటనలను వెలువరించటం దగ్గర్నుంచి వృద్ధిరేటుకు సంబంధించిన అన్ని విషయాల వరకూ ముఖ్యమంత్రే స్వయంగా అనేక రకాల ప్రకటనలు వెలువరించటం ఇక్కడ గమనార్హం. ఆదాయ - వ్యయాలు - మిగుళ్లకు సంబంధించి ఈటెల ప్రకటనలు ఒక విధంగా ఉంటే, ముఖ్యమంత్రి ప్రకటనలు అందుకు భిన్నంగా ఉంటున్నాయనే విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని ఈటెల పేర్కొంటే... దీనివల్ల తెలంగాణాకు ఎలాంటి ఇబ్బందీ రాలేదంటూ చెప్పిన సీఎం ఇదే క్రమంలో కేంద్రాన్ని ప్రశంసించటం గమనార్హం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈటెల నామమాత్రమయ్యారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి ఈ పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయిందని గుసగుసలాడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/