బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్ ఏకంగా మోడీ కుంభస్థలాన్నే టార్గెట్ చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటికావడంతో పాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ప్రధాని నరేంద్రమోడీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం రాత్రే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. మంగళవారం ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలను ముమ్మరం చేయనున్నారు. సతీమణి శోభకు ఎయిమ్స్ లో టెస్టులు, ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులతోపాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటి కావడంతోపాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి సెగ్మెంట్ లోనే కేసీఆర్ బీజేపీ వ్యతిరేక ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మాజీ ఐఏఎస్ లు, మాజీ ఐపీఎస్ లతోపాటు బీజేపీ, కాంగ్రెస్ యేతర నేతలతో సమావేశమవ్వనున్నారు. రాజకీయ వేదిక, జాతీయ పార్టీల వైఫల్యాలు, ప్రజల ముందు పెట్టాల్సిన ఎజెండా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతపై కేసీఆర్ చర్చించనున్నారు. ఈ భేటిపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.
వారణాసి లోక్ సభ స్థానం పరిధిలో 7వ విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 4వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్.సీపీ నేత శరద్ పవార్ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి. వీరితోపాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మిగతా నేతలతో కలిసి వారణాసి వెళతారా? లేక విడిగా వెళతారా? అనేది తెలియాల్సి ఉంది.