కేంద్రం ఫెయిల్ అయినప్పుడల్లా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రస్తుతం కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జీఎస్టీ చెల్లించలేక కేంద్రం చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే కేరళ, తెలంగాణ సీఎంలు కేంద్రంపై తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రాన్ని ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాయంటున్నారు. మరి ఇదే అదునుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి.. కేటీఆర్ రాష్ట్ర సీఎం సీటులోకి మారిపోతారనే చర్చ సాగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఏంటా కథాకమామిషూ అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పుడు టీఆర్ఎస్ లో.. మరియు ఎమ్మెల్యేల్లో ఒకటే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడని.. కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అనే సామెత ఉంది. ఆ విధంగా ఇప్పుడు కేటీఆర్ పట్టాభిషేకం కరోనా రూపంలో వచ్చిందని అంటున్నారు.
భారతదేశంలో ఆర్థికమాంద్యం దెబ్బకు దేశం అంతా కుదేలు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ కోతలు పెట్టారు. నాన్ బీజేపీ పార్టీలు.. నాన్ కాంగ్రెస్ వాళ్లు ఒక్కటైతే తప్ప రాష్ట్రాలు బాగు పడవు అని.. ముందునుంచి కేసీఆర్ చెప్తున్నారు.
అందుకే ఎన్నికల సమయంలోనే ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ కాస్త గట్టిగానే ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల్లో మోడీ అంతకుముందు కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాడు. ఇప్పుడు ఆ అవసరం వచ్చిందని.. రాష్ట్రాల్లో ఇక కేటీఆర్ కు పట్టాభిషేకం చేసి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నేతలు, పార్టీలను ఒక్కటి చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యాడంట..
2021లో స్వామీజీలు ఇచ్చిన తేదీలకు కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళతాడని అంటున్నారు.