కేసీఆర్ తీరుతోనే బ‌హిష్క‌ర‌ణ తీర్పు వ‌చ్చిందా?

Update: 2018-04-18 05:03 GMT
ఎంత క‌లిసి వ‌చ్చే కాల‌మైనా అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. లేకుంటే కోరి స‌మ‌స్య‌ల్ని ఆహ్వానించిన‌ట్లే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి ఇంచుమించే ఇదే రీతిలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు స‌రిగా లేదంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. సంప‌త్ కుమార్ ల బ‌హిష్క‌ర‌ణ వేటును ర‌ద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ స‌ర్కారుకు షాక్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

తాము తీసుకునే నిర్ణ‌యం మంచిదా?  చెడ్డ‌దా?  అన్న విష‌యంపై చ‌ర్చ లేకుండా ఒంటెద్దుపోక‌డతో వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ కార‌ణ‌మే తాజా తీర్పు అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై వేటు వేసేందుకు కేసీఆర్ అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని.. తొంద‌ర‌ప‌డ‌కుండా ఉంటే బాగుండేద‌న్న మాట టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నేత‌లు లోగుట్టుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.

అధినేత‌కు ఎదురు చెప్ప‌ని వైనం టీఆర్ ఎస్ పార్టీలో మ‌రికాస్త ఎక్కువే. అధినేత‌కు ఏ మాత్రం న‌చ్చ‌ని మాట ఎవ‌రైనా నోటి నుంచి వ‌స్తే.. అంత‌కంత అనుభ‌వించాల్సి ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కార‌ణంతోనే.. పార్టీలో తీసుకునే నిర్ణ‌యాలు అసంతృప్తిని ర‌గిలిస్తున్నా.. గుట్టుగా క‌డుపులో దాచుకోవ‌టం గులాబీ నేత‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదే.. తాజాగా కోర్టు షాకింగ్ తీర్పు వ‌చ్చేలా చేసింద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేసే విష‌యంలో పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ సంగ‌తి ప‌క్క‌న పెట్టినా.. ఈ ఉదంతంపై కోర్టుకు వెళ్లిన నేప‌థ్యంలో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ కు బ్రీఫ్ చేసే విష‌యంలోనూ కేసీఆర్ దారుణంగా ఫెయిల్ అయ్యార‌ని చెబుతారు.

వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే విష‌యంలో కేసీఆర్ తీసుకునే కేర్ అంతా ఇంతా కాదు. అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో కోర్టు ఈ విష‌యంపై పెద్ద‌గా జోక్యం చేసుకోద‌న్న న‌మ్మ‌క‌మే కేసీఆర్ కొంప ముంచింద‌ని చెబుతారు. దీనికి తోడు ఈ మ‌ధ్య కాలంలో పెరిగిన ఆత్మ‌విశ్వాసంతో ఆయ‌న చాలామందికి అందుబాటులోకి రావ‌టం లేదంటున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రిపై బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన ఉదంతంలో.. ఈ వ్య‌వ‌హారం కోర్టు మెట్ల‌కు ఎక్కిన స‌మ‌యంలోనూ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ను పిలిపించుకొని ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏం చేయాల‌న్న అంశంపై బ్రీఫ్ చేయాల్సి ఉంద‌ని.. కానీ అదేమీ చేయ‌కుండా.. చివ‌ర‌కు ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ని కార‌ణంగానే.. త‌న‌కు తోచిన మాట ఆయ‌న చెప్ప‌టం.. తాజా తీర్పుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

పైకి చూసిన‌ప్పుడు స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై వీడియో టేపులు కోర్టుకు స‌మ‌ర్పిస్తాన‌ని చెప్పిన మాట‌.. తుది తీర్పుపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించిన‌ట్లుగా తెలుస్తోంది. కోర్టుకు టేపులు ఇస్తాన‌న్న ఆడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌.. త‌ర్వాత మాట మార్చేయ‌టం.. సీడీలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా లేక‌పోవ‌టం.. కోర్టు అదే విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టంతో కేసు కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదే తుది తీర్పుపై ప్ర‌భావాన్ని చూపింద‌ని చెప్పొచ్చు. కీల‌క‌మైన అంశాల విష‌యాల్లో ముఖ్య‌నేత‌లు బ్రీఫింగ్ తీసుకోవ‌టం.. ఇవ్వ‌టం మామూలే. దీనికి భిన్నంగా కేసీఆర్ బిహేవియ‌ర్ ఉంద‌ని తెలుస్తోంది. కేసీఆర్ ఎవ‌రికీ అందుబాటులోకి రాక‌పోవ‌టంతో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ త‌న‌కు తోచిన విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. అదే తాజా తీర్పున‌కు కార‌ణంగా మారింద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News