తెలుగు ప్రజల మధ్య రెండు రాష్ట్రాల పేరిట నెలకొన్ విభేదాలు ఒక్కటొక్కటిగానే పరిష్కారమయ్యే సూచనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉండగా.. రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. తెలుగు నేల విభజన జరిగిన, రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ఏ ఒక్క సందర్భంలోనూ కలిసిమెలసి ముందుకు సాగే దిశగా ఇటు చంద్రబాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. ఓటుకు నోటు కేసు వీరిద్దరి మధ్యే కాకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కూడా చిచ్చు పెట్టినట్టైంది. అయితే ఈ తరహా విభేదాలు ఇకపై కనిపించవన్న వాదన బలంగానే వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించిన నేపథ్యంలో కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు ఇట్టే తొలగిపోతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే సీఎంగా తాను చేయబోయే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని జనగ్ పిలవగానే కేసీఆర్ వచ్చేశారు. ఇద్దరం కలిసి తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిద్దామంటూ ఇద్దరు నేతలు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ ఫలితం ఎలా ఉంటుందో చూసేందుకు ఎక్కువ సమయమేమీ ఆగాల్సిన పనిలేకుండానే పోయింది.
శనివారం నాడు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన జగన్... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు వెళ్లారు. మరికాసేపటికే కేసీఆర్ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు సీఎంలు, గవర్నర ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చాలా సేపే చర్చించారు. ప్రధానంగా 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించే దిశగా ఎలా ముందుకు సాగాలన్న విషయంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య స్నేహపూరిత వాతావరణం లేని నేపథ్యంలో ఎంత యత్నించినా..ఈ సంస్థల విభజన ఇప్పటిదాకా అసలు మొదలే కాలేదని చెప్పాలి.
ఆయా సంస్థల విభజన కోసం ఏపీ కొంత మేర గట్టిగానే యత్నించినా... తెలంగాణ తనదైన వాదనలను ముందుకు తీసుకుని వచ్చింది. తెలంగాణ వాదనకు సరైన ఆన్సర్లివ్వడంలో ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా సఫలీకృతం కాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ కోఆపరేషన్ ఉంటే తప్పించి ఈ సంస్థల విభజన పూర్తి కాదన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తోంది. ఈ వాదన సరేనన్నట్లుగానే ఇప్పుడు కేసీఆర్, జగన్ లు గవర్నర్ వద్ద కూర్చొని వాటి విభజన కోసం ఓ కీలకమైన అడుగు వేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదే తరహా ధోరణి మున్ముందు కూడా కొనసాగితే... అసలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇకపై సమస్యలు, వివాదాలన్న మాటే వినిపించదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.