యాగాలతో బొందుగాళ్ల మచ్చ పోతుందా?

Update: 2019-07-31 14:30 GMT
కోపం వస్తే ఆయన కచ్ఛితంగా కేసీఆర్ మాదిరే వ్యవహరిస్తారు. మొహమాటం లేకుండా భాజాప్తా.. ఎవరినేం అనాలో అనేస్తారు?  అందుకు ఎంత మూల్యం చెల్లించటానికైనా వెనుకాడరు. అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం మగాడంటూ ప్రైవేటు సంభాషణల్లో పొగిడేసేది. అలా అని ఆయన చేసే పనులన్ని మంచిగా ఉంటాయని కాకున్నా.. కొన్ని సందర్భాల్లో తన గుండెల్లో మంటను.. బరిసెల్లాంటి మాటలతో రువ్వేయటానికి ఏ మాత్రం మొహమాటపడరు. అది మోడీ కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.

ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల ప్రయోజనం తప్పించి మరింకేమీ ఆలోచించని కేసీఆర్ అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తారు. తన ప్రధాన ఆయుధమైన భావోద్వేగాన్ని రంగరించి.. అవసరమైతే ఆంధ్రోళ్లను సైతం నాలుగు మాటలు అనేస్తారు. కావాలంటే తర్వాతి రోజుల్లో ఆంధ్రోళ్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే తన  పంటితో తీస్తానన్న మాట అనేసి వారి మనసును దోచేస్తారు.

ఇలా మాటల విషయంలో వెనక్కి తగ్గని ఆయనకు తొలిసారి దిమ్మ తిరిగేలా షాకిచ్చింది మాత్రం కరీంనగర్ ప్రజలేనని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మీద విపరీతమైన ఫస్ట్రేషన్లో ఉన్న కేసీఆర్.. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ ఎంత తీవ్రంగా విరుచుకుపడ్డారో తెలియంది కాదు. ఆయన అన్నది బీజేపీని ఉద్దేశించే అయినా.. ప్రతి హిందువు తననే అన్నట్లుగా ఫీల్ కావటంతో సీన్ మొత్తం రివర్స్ కావటమే కాదు.. బరిలో ఉన్న బలమైన వినోద్ కుమార్ లాంటి నేత సైతం ఓడిపోవాల్సిన పరిస్థితి.

హిందుగాళ్లు.. బొందుగాళ్ల మాట మరకగా మారి టీఆర్ ఎస్ ను..  కేసీఆర్ ను వెంటాడి వేధిస్తోంది. తమన తాము హిందువుల్ని ఉద్దరించటానికే ఉన్నామన్నోళ్లు  కూడా చేయలేని పనిని చేయటం ద్వారా.. తానెంత పక్కా హిందువునన్న విషయాన్ని ఫ్రూవ్ చేసేందుకు వీలుగా సుదర్శన యాగాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. తాజా.. యాగంతో అయినా.. తనను వెంటాడుతున్న బొందుగాళ్ల మాట పోతుందన్న ఆశతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఆయన కోరుకున్నట్లుగా బొందుగాళ్ల మాట పోతుందా?  లేదా? అన్నది తేలాలంటే యాగం పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News