10 జిల్లాల తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ ఆచణలో పెట్టేశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న తన డ్రీమ్ ను సాకారం చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పాలన ఒక ఎత్తు... ఇకపై జరగనున్న పాలన మరో ఎత్తు అని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్.. ముందు కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. మొన్నటి వరకు ఉన్న 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల మహా తెలంగాణగా మార్చారు. ఇప్పుడు ఇక, పాలనపై దృష్టి పెట్టారు.
సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా ప్రజలకు సత్వరమే అందించేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అంతేకాదు, పాలనా అధికారాల విషయంలో కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇచ్చారు. కలెక్టర్ కేంద్రంగా పాలనను మరింతగా విస్తృతం చేయనున్నారు. అదేసమయంలో జాయింట్ కలెక్టర్లు - జిల్లా రెవెన్యూ అధికారులు - డివిజనల్ రెవెన్యూ అధికారుల కేడర్ లో పనిచేసేవారికి వర్క్ డివిజన్ చేయడంతో పాటు ఉన్నత అధికారాలను కూడా బదలాయించి, వారినే నేరుగా జవాబుదారీగా మార్చేలా బిజినెస్ రూల్స్ తయారవుతున్నాయి.
పోలీస్ శాఖలో ఉన్న మాదిరిగానే మూడు - నాలుగు జిల్లాలకు కలిపి సెక్రటరీ స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని కోఆర్డినేటర్ గా నియమించనున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రకారం.. రాష్ట్ర ప్రజలకు కలెక్టర్లు మరింత చేరవకావాలి. ప్రజల సమస్యల్లో 75% అక్కడే పరిష్కారం కావాలి. భూమికి సంబంధించిన సమస్యలు దాదాపు 90 వరకు జిల్లాలో పరిష్కారం అయ్యే విధంగా కలెక్టర్లకు అధికారాలు బదలాయించనున్నారు. ఈ అంశాలను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అదనంగా సీసీఎల్ ఏలో ఉండే డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారిని నియమిస్తారు.
ఆయా సంస్కరణలను దీపావళి ముగిసిన వెంటనే అమల్లో పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపావళి తరువాత జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నట్టు సమాచారం.ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తన విజన్ ను కలెక్టర్లకు వివరించి, ప్రజలకు పాలనను మెరుగయ్యేలా చూస్తారని సమాచారం. బంగారు తెలంగాణ లక్ష్యాలు ఏమిటో కూడా వివరిస్తారు. సో.. జిల్లాల పాలన కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అదిరింది కదూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/