దేశానికి రాజైనా.. సొంతూరికి మాత్రం బిడ్డే అన్న నానుడికి తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారు. తనకు జన్మనిచ్చిన పురిటిగడ్డ రుణం తీర్చుకోవటంలో సక్సెస్ అయ్యారు. రెండేళ్ల క్రితం తాను పుట్టిన పురిటిగడ్డ సిద్ధిపేటలో మెడికల్ కాలేజీ తెస్తానంటూ హామీ ఇచ్చారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? కేసీఆర్ తలుచుకుంటే కాని పనేమైనా ఉంటుందా? అన్న చందంగా రెండేళ్లు తిరిగేసరికి మెడికల్ కాలేజీ సిద్ధమైంది.
2018-19 విద్యా సంవత్సరంలో తరగతుల్ని ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిల భారత వైద్యమండలి ప్రమాణాలకు అనుగుణంగా రూ.20కోట్లతో 300 పడకల సామర్థ్యంతో జీ+4 అంతస్తుల్లో ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. తొలి ఏడాదిలో 150 సీట్లు కేటాయించారు. అధ్యాపకుల రిక్రూట్ మెంట్ పూర్తి అయ్యింది.
జూన్ 4న ప్రారంభించిన ఈ కళాశాలకు సంబంధించి శాశ్విత భవన సముదాయాల నిర్మాణం రూ.108 కోట్ల వ్యయంతో సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్నారు. ఆగస్టు 1న ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి.. ఆ తర్వాతి రోజు నుంచి తరగతుల్ని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. తన పురిటిగ్డకు యుద్ధ ప్రాతిపదికన వైద్య కళాశాలను తెప్పించిన కేసీఆర్.. మిగిలిన జిల్లాల్లోనూ ఇంతే వేగంగా పనులు చేయించాల్సిన అవసరం ఉంది.
ఆయన్ను తెలంగాణకు సీఎం చేసింది సిద్ధిపేటకు ఏదేదో చేయించుకోవటానికి కాదని.. తెలంగాణ మొత్తాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతోనన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పురిటి గడ్డ మాదిరే తెలంగాణను కూడా ఇంతే శ్రద్ధతో పట్టించుకోండి సారూ.