కాంగ్రెస్ లీక్స్: కేసీఆర్ మెడికల్ రిపోర్ట్స్ విడుదల

Update: 2018-10-06 07:40 GMT
తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. చావు అంచుల వరకూ వెళ్లి రాష్ట్రం సాధించానని చెబుతున్న కేసీఆర్ కు దిమ్మదిరిగేలా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చాడు. తెలంగాణ ఏర్పాటుకు తనే కారణమని చెబుతున్న కేసీఆర్ ను ఎండగట్టడానికి ఏకంగా హైదరాబాద్ లోని నిమ్స్ నుంచి కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో చికిత్స తీసుకున్న రిపోర్ట్ సంపాదించి తాజాగా బయటపెట్టారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తూ రెండు వారాల పాటు నిమ్స్ లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే..

తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్స్ లో కేసీఆర్ చికిత్స పొందిన నివేదక పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు. కేసీఆర్ ఇంజక్షన్ ద్వారా యాంటీ మెంటేషన్  - మల్టీ విటమిన్లు - ఇతర ఔషధాలతో ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నాడని ఈ పత్రాల్లో ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని దీంతో నిరూపితమైనట్టు చూపించాడు. కేసీఆర్ నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల సాయంతో బలానికి సంబంధించిన  పోషకాలను గ్లూకోజ్ ద్వారా ఎక్కించుకున్నాడని స్పష్టం చేశారు.

ఇది వరకూ దేశంలో కొందరు  పౌరహక్కుల కార్యకర్తలు - ఐరోమ్ చాను షర్మిలా కూడా ఇలానే ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేశారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు... ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా అలాంటి దీక్షేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఖమ్మం ఆస్పత్రిలో మూడు రోజులు కేసీఆర్ ఉపవాసం చేశడని... అక్కడే ఒక గ్లాస్ నిమ్మరసం తాగి దీక్షను విరమించాడని ఉత్తమ్ తెలిపారు. అయితే అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ అగ్గి మీద గుగ్గిలం కావడంతో కేసీఆర్ మళ్లీ దొంగ ఉపవాస దీక్ష చేపట్టాడని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. ఒకప్పుడు ఢిల్లీలో నకిలీ వీసా రాకెట్లో కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని.. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ ఎం సత్యనారాయణ రావు వ్యక్తిగత హామీపై కేసీఆర్ ను విడుదల చేశారని సంచలన నిజాలు వెల్లడించారు.
Tags:    

Similar News