గవర్నర్‌కు కేసీఆర్‌ ఏం చెప్పారు..?

Update: 2015-06-23 10:40 GMT
విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేయాలని అటార్నీ జనరల్‌ నోటి మాటగా గవర్నర్‌కు చెప్పారన్న వార్తలో నిజానిజాలు.. అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకముందే.. పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.

సెక్షన్‌ 8 అమలుకు సంబంధించిన అంశంపై ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గవర్నర్‌తో భేటీకి ముందు అందుబాటులో ఉన్న తెలంగాణ మంత్రులు.. ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ కావటం తెలిసిన విషయమే. సెక్షన్‌ 8 అమలును తీవ్రంగా వ్యతిరేకిద్దామని.. జాతీయస్థాయిలో కూడా మద్ధతు కూడగట్టుకోవాలన్న వాదనను కొందరు నేతలు తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.

ఇక.. గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్షన్‌ 8 అమలు అంశంపై సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయానికి తాము సానుకూలంగా ఉండవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ.. కేంద్రం కానీ బలవంతంగా దీన్ని తమపై రుద్దాలని చూస్తే.. తీవ్ర ప్రతిఘటన తప్పదన్న వాదనను వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా సాగిన భేటీలకు భిన్నంగా తాజా భేటీగా జరిగినట్లు చెబుతున్నారు. గత భేటీల్లో మాదిరి కేసీఆర్‌  కూల్‌గా లేరన్న వాదన వ్యక్తమవుతోంది.



Tags:    

Similar News