తాను ఒకసారి ఫిక్సు అయితే ఎవరేం చెప్పినా.. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని చెప్పాలి. అలాంటి పెద్ద మనిషికి ఇప్పుడో పెద్ద పని పడింది. తనకు నచ్చని ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించి.. ఇప్పుడు పార్టీ మారేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే.. బీజేపీలో చేరనున్న ఈటల.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఆమోదించకుండా ఉండలేరు. ఆమోదించిన ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను ఎదుర్కొనేందుకు ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు మరో వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. తనతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన ఈటలకు.. తన నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఈటల ముందే అంచనా వేయగలరు. అందుకే.. కాస్త భిన్నమైన ప్లానింగ్ ను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ.. రాష్ట్ర సాధనలోనూ ఈటల పాత్రను తక్కువగా చేసి చూడలేం.
ఇప్పటికి ఆయన చుట్టూ ఉద్యమ నేతలు పలువురు తిరుగుతూనే ఉంటారు. ఉప ఎన్నిక వేళ.. వారి ప్రచారం.. ఈటలకు జరిగిన అన్యాయం లాంటి అంశాలు హైలెట్ కావటం ఖాయం. అందుకే.. ఏ ఉద్యమ నేతలతో తనను ఉక్కిరిబిక్కిరి చేస్తారో.. అదే ఉద్యమ నేతల్ని ఈటల మీద ప్రయోగించాలన్నది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఈటల మీద తమ అభ్యర్థిని బరిలోకి దించే వేళలో.. సదరు నేతకు తోడుగా ఉద్యమ నేతలు ఉండటం ద్వారా ఈటల దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నది పెద్ద సారు ఆలోచనగా చెబుతున్నారు.
అందుకే.. ఇప్పుడు పార్టీలో ఉద్యమ నేతలు ఎవరున్నారన్న ఆరా తీస్తున్నారు. కిందిస్థాయి నాయకత్వం మొత్తం ఉద్యమ నేతలకు వెళితేనే ఈటల ప్రచారానికి చెక్ పెట్టొచ్చంటున్నారు. ఇందులో భాగంగా కింది స్థాయిలో నాయకత్వం మొత్తం ఉద్యమంలో పని చేసిన వారిని ఉంచేలా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి ఉద్యమ పార్టీ.. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నవారు పార్టీలో ఎవరెవరు ఉన్నారన్నది వెతికే పరిస్థితికి రావటం దేనికి నిదర్శనం?