సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయినప్పటికీ.. రాజకీయం మాత్రం వేడెక్కిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా అంతా కూడా ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. పీకే డైరెక్షన్ లో స్క్రిప్టు రెఢీ చేసిన కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టే దిశగా ఏర్పాట్లు వేగవంతం చేశారన్న ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటున్న కేసీఆర్ జర్నీ అంత సాఫీగా సాగదన్న మాట వినిపిస్తోంది. ఆయన ఎంట్రీతో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. మోడీ మరోసారి ప్రధానమంత్రి కాకుండా చూడటమే తన లక్ష్యమన్న పట్టుదలతో ఉన్న గులాబీ బాస్ కారణంగా.. ఇంతకాలంగా నిద్రాణంగా ఉన్న కొత్త రాష్ట్రాల డిమాండ్లు తెర మీదకు రావటం ఖాయమంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. దేశంలోని దాదాపు పది కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం గళాలు వినిపించటం తెలిసిందే. అయితే.. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మీద కేంద్రం ఎలాంటి కసరత్తు చేయటం లేదన్న విస్పష్ట ప్రకటనతో పాటు.. ఎక్కడి ఉద్యమాల్ని అక్కడ నియంత్రణ చేయటం ద్వారా ఇప్పటికైతే కొత్త రాష్ట్రాల డిమాండ్లు పెద్దగా వినిపించని పరిస్థితి. కానీ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ద్వారా.. ఇంతకాలం నిద్రాణంలో ఉన్న కొత్త రాష్ట్రాల డిమాండ్లు తిరిగి తెర మీదకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
బిహార్ లో ‘మిథిలిలాంచల్’.. గుజరాత్ లో ‘సౌరాష్ట్ర’.. కర్ణాటకలో ‘కూర్గ్’.. వీటితో పాటు ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను కలిపి బుందేల్ ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి బలంగా వినిపించే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా పది కొత్త రాష్ట్రాల డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి. ఒకప్పటి ఉద్యమ నాయకుడిగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కేసీఆర్ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో తేడా వస్తే మొదటికే మోసం వచ్చే వీలుంది.
ఒకవేళ..కొత్త రాష్ట్రాలకు మద్దతు పలికితే.. వాటికి వ్యతిరేకించే వారు కేసీఆర్ పార్టీకి.. వారి భావజాలానికి వ్యతిరేకులుగా ఉంటారని చెప్పక తప్పదు. ఒకవేళ తాను అనుకున్నట్లుగా జరిగి.. తాను సిద్ధం చేసే కూటమి చేతికి అధికారం వస్తే.. కొత్త రాష్ట్రాల డిమాండ్ల విషయంలో ఆయన స్టాండ్ ఏమిటన్నది స్పష్టం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారన్నది అసలు ప్రశ్న.
ఒకవేళ.. ఉద్యమ నేతగా తనకున్న ఇమేజ్ కు తగ్గట్లు కొత్త రాష్ట్రాలకు తాను సానుకూలమన్న సంకేతాల్ని ఇస్తే మాత్రం.. రానున్న రోజుల్లో దేశంలో మరిన్ని ‘తెలంగాణ’ తరహా కొత్త రాష్ట్రాలకు అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి.. వీటిని వ్యతిరేకించేవారు ఊరికే ఉంటారన్నది అసలు ప్రశ్న. మరి.. ఇలాంటి వాటికి కేసీఆర్ సమాధానాలు ఏమిటన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పాలి.