తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల మధ్య ఏర్పడిన సఖ్యత కొద్దిరోజులుగా పొరపొచ్చాల స్థితికి చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చర్చకు అనేకానేక కారణాలు ఉండగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తుంటారు.
అయితే, రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఇందులో జగన్ సర్కారును దోషిగా చేసేలా తెలంగాణ సర్కారు ప్రయత్నించిందని పేర్కొంటున్నారు.
ఈ సమావేశంలో విద్యుత్తు బకాయిలు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, పన్నుల కోసం విభజన చట్టానికి సవరణ, నగదు నిల్వల పంపిణీ, పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీల అం శాలను చర్చించారు. విద్యుత్తు, ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడాన్ని తెలంగాణ అధికారులు తప్పుపట్టారు.
విద్యుత్తు, ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడాన్ని తెలంగాణ అధికారులు తప్పుపట్టారు. మందుగా కోర్టుల్లో వేసిన కేసులు విత్‌డ్రా చేసుకుంటే, సమస్యలన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు తేల్చి చెప్పారు.
తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు ఏపీ నిర్వాకం వల్ల ఎస్బీఐలో క్యాష్‌క్రెడిట్ దక్కని విపత్కర పరిస్థితి ఏర్పడిందనే రీతిలో తెలంగాణ రాష్ట్ర అధికారులు వాదించారు. ``రాష్ట్ర విభజన తరువాత కేంద్రం సబ్సిడీలన్నీ ఏపీ ఖాతాలో పడ్డాయి. వాటిని తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ సర్కారు వాడుకుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన పంటలకు డబ్బులు ఇవ్వడానికి బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా రూ.354.08 కోట్లు బ్యాంకులకు బకాయిపడింది`` అంటూ కమిటీలో ప్రస్తావించారు. దీంతో కేంద్రం నుంచి తమకు సబ్సిడీ రాగానే ఇస్తామని ఏపీ తెలియజేస్తూ ఇందుకు అండర్‌టేకింగ్ ఇస్తామని తెలిపింది. మొత్తంగా ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తెలంగాణను సమస్యల్లో పడేస్తుందన్న రీతిలో మొదటి సమావేశంలో చర్చలు జరిగాయి.