బాబు హైటెక్ సిటీని త‌ల‌ద‌న్నేలా కేసీఆర్ ఐటీ హ‌బ్?

Update: 2021-07-15 12:30 GMT
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిసారి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత తనదేనని.. ఇక్కడ హైటెక్ సిటీ, సైబ‌రాబాద్  అనే కొత్త న‌గ‌రాన్ని నిర్మించాన‌ని పదేపదే చెబుతూ ఉంటారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోతున్నా చంద్రబాబు మాత్రం ఈ డైలాగ్ వదలటం లేదు.

చంద్రబాబు ఇలా చెప్పుకోవడం ఎలా ఉన్నా ఆయన సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌ను గ్లోబ‌ల్ సిటీగా మార్చ‌డంలో త‌న‌దైన ముద్ర అయితే వేశారు. చివ‌ర‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ సైతం హైద‌రాబాద్‌కు ఐటీ ఇమేజ్ రావ‌డానికి కార‌ణం చంద్ర‌బాబే అని చెప్పారు.

ఏదేమైనా కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ‌ను ఎంత అభివృద్ధి చేస్తున్నా హైద‌రాబాద్ ఇమేజ్ విష‌యంలో చంద్ర‌బాబు మాట‌ను దాటి కేసీఆర్ మాట రావ‌డం లేద‌న్న ఓ టాక్ ఉంది. ఇందుకు ప్ర‌ధానంగా హైటెక్ సిటీతో పాటు సైబ‌రాబాద్, రోడ్లు, ఇత‌ర మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌నే..!  అయితే ఇప్పుడు కేసీఆర్ చంద్ర‌బాబు నిర్మించార‌ని ప‌దే ప‌దే గొప్ప‌గా టీడీపీ వాళ్లు ప్ర‌చారం చేసుకునే హైటెక్ సిటీని త‌ల‌ద‌న్నేలా మెగా ఐటీ హ‌బ్ నిర్మించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రెడీ అవుతోంది.

హైదరాబాద్‌ శివార్లలలో మరో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం దీనిని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అత్యంత స‌మీపంలో కొల్లూరు - ఇదుళ్లనాగులపల్లి గ్రామాల వ‌ద్ద ఏర్పాటు చేస్తోంది. ఇది ఔట‌ర్ రింగోరోడ్డుకు కూత‌వేటు దూరంలోనే ఉంది. ఇక్క‌డ ప్ర‌భుత్వ సీలింగ్‌, అసైన్డ్ భూములు 700 ఎక‌రాల వ‌ర‌కు ఉన్నాయి.

ఇక భూసేక‌ర‌ణ‌కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. సంగారెడ్డి - రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలో ఈ కొత్త ఐటీ జోన్ రానుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ‌కు ప్ర‌పంచ స్థాయి హైటెక్ సంస్థ‌లు వ‌చ్చేలా కేటీఆర్ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

హైటెక్ సిటీని త‌ల‌ద‌న్నేలా ఈ కొత్త ఐటీ హ‌బ్ తీర్చిదిద్ద‌నున్నార‌ట‌. ఇందుకోస‌మే ఔటర్ రింగ్ రోడ్డు సైడ్ ర‌హ‌దారుల‌ను కూడా నాలుగు లేన్లు - ఆరు లేన్లుగా మారుస్తున్నారు.
Tags:    

Similar News