చివ‌రిచూపుకు కేసీఆర్ వెళ్లలేదు

Update: 2015-07-30 11:30 GMT
కొన్ని విష‌యాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఆయ‌న ఎందుక‌లా చేస్తారో ఆయ‌న సన్నిహితులు కూడా స్ప‌ష్టంగా చెప్ప‌లేరు. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం మ‌ర‌ణించిన వెంట‌నే.. ఆ ప‌క్క రోజు సెల‌వు ప్ర‌క‌టించి.. మిగిలిన వారి కంటే ముందుగా నిర్ణ‌యం తీసుకున్నారు.

అబ్దుల్ క‌లాం మృతి ప‌ట్ల ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఇన్ని చేసిన ఆయ‌న‌.. క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు వెళ‌తార‌న్న మాటే చెప్పారు. కానీ.. గురువారం ఉద‌యం త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో జ‌రిగిన అంత్య‌క్రియ‌ల‌కు కేసీఆర్ దూరంగా ఉన్నారు.

క‌లాం మ‌ర‌ణించార‌న్న మాట తెలిసిన వెంట‌నే.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే సెల‌వు డిక్లేర్ చేసిన కేసీఆర్‌.. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు మాత్రం దూరంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

నిజానికి క‌లాం ఒక్క‌రే కాదు.. ఆయ‌న విప‌రీతంగా అభిమానిస్తాన‌ని చెప్పేవారి విష‌యంలోనూ.. గొప్ప‌గా అభివ‌ర్ణించే వారికి సంబంధించి.. వారు మ‌ర‌ణిస్తే మాత్రం ఆయ‌న వెళ్ల‌ని ఉదంతాలు గ‌తంలోనూ చోటు చేసుకున్నాయి. క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌వుతార‌న్న కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌టం కాస్తంత ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశ‌మే. అలా అని ఆయ‌న అనారోగ్యంగా ఉన్నారా? అంటే అదీ లేదు. అయిన‌ప్ప‌టికీ.. కలాం చివ‌రి చూపు చూసే అవ‌కాశం ఉన్నా ఆయ‌న ఎందుకు వెళ్ల‌లేద‌న్న‌ది.. ఆయ‌న అంత‌రాత్మ‌కు మాత్ర‌మే బాగా తెలుసు
Tags:    

Similar News