అది జ‌రిగిన వెంట‌నే బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ

Update: 2018-10-04 17:21 GMT
తెలంగాణ ఆడ‌బ‌డుచుల‌కు కేసీఆర్ ఆస‌క్తిక‌ర సంగ‌తిని చెప్పుకొచ్చారు. న‌ల్గొండ జిల్లాలో నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ వేదిక నుంచి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. తెలంగాణ ఆడ‌బ‌డుచుల‌కు తాను చెప్పాల‌నుకున్న అంశం ఒక‌టి ఉంద‌న్నారు. బతుక‌మ్మ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు తాము చీర‌లు ఇద్దామ‌నుకుంటే కొంద‌రు కోర్టుకు వెళ్లార‌న్నారు. భువ‌న‌గిరి చెందిన‌ గూడురు నారాయ‌ణ‌రెడ్డి అనే వ్య‌క్తి ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేశార‌ని.. దీంతో.. ఈసీ ఆదేశాల కార‌ణంగా చీర‌ల పంపిణీని ఆపేసిన‌ట్లు చెప్పారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల కార‌ణంగా ద‌స‌రా లోపు తాము చీర‌లు పంచ‌లేక‌పోయినా.. ఎన్నిక‌లు ముగిసి కోడ్ ఎత్తేసిన తెల్లారే.. ప్ర‌తి తెలంగాణ ఆడ‌ప‌డుచు కాళ్ల ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి చీర‌లు పంచుతామ‌న్నారు.

మీరేం రంది ప‌డ‌కండి.. బ‌తుక‌మ్మకు చీర‌లు పంపిణీ చేయ‌లేక‌పోతున్నాం.. కానీ కోడ్ ఎత్తేసిన తెల్లారే అంద‌రికి చీర‌లు అందుతాయ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో శుక్ర‌వారం నుంచి రైతుబంధు ప‌థ‌కం చెక్కుల్ని పంపిణీ చేస్తామ‌న్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల మాదిరే.. రైతుబంధు చెక్కుల విష‌యంలోనూ కాంగ్రెస్ నేత‌లు కోర్టుకు వెళ్లార‌ని.. అక్క‌డ రెండు చెంప‌లు వాయించింద‌న్నారు.

Tags:    

Similar News