బీసీలకు ప్రేమతో... కేసీఆర్ !

Update: 2018-07-28 06:10 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు హఠాత్తుగా బిసీలపై  ప్రేమ పెరిగింది. ఆ కులాల వారికి ఏదో చేసేయలనే తపన మొదలయింది. రాష్ట్రంలో బిసి కులాలు ఎన్నున్నాయి....... కులాల వారీగా జనాభా ఎంత వంటి వివరాలపై అసక్తి కలిగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు తెలంగాణలో బిసిల గణన ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసారు. ఇంత హఠాత్తుగా బిసి కులాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. ప్రతి పంచాయితికి కార్యదర్శులను నియమిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ బిసిల లెక్కింపు ఎందుకు చేపట్టారు... ఏమీ లేదు.....ఏడాదిలో రాష్ట్రంలో  ఎన్నికలు రానున్నాయి.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కొంత పట్టుంది, ముఖ్యంగా గ‌తంలో బిసిలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేవారు, వారి ఓట్లతోనే తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించేది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్‌కు ఈ విషయం తెలియంది కాదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ - తెలుగుదేశం కలసి పోటి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో బిసి ఓటర్లను చేజార్చుకోకూడదనే కేసీఆర్ ఈ బిసిల గణనను ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. వీలున్నంత త్వరగా బిసిల లెక్కింపు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ లెక్కింపు పూర్తైన తర్వాత కులాల వారిగా - వృత్తుల వారిగా తాయిలాలు పంచే కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నారు. ఇలా బిసి కులాలను ఆకర్షించి వచ్చే ఎన్నికలలో వారి ఓట్లు తమకే పడేలా చేసుకోవాలన్నది కేసీఆర్ వ్యూహం.
Tags:    

Similar News