ఏ విషయంలో అయినా కేసీఆర్ చాలా క్లారిటీతో ఉంటారు. వ్యూహంలో భాగంగా దాగుడు మూతలు ఆడినా.. తన మనసులో ఏమనుకునేదన్న విషయాన్ని ఆయన ఏదో రకంగా అర్థమయ్యేలా చేస్తుంటారు. హరీశ్.. కేటీఆర్ లలో ఎవరు ఎక్కువ? అన్న ప్రశ్న తన ఎదుట వచ్చే అవకాశాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. అలా అని.. ఆ పరిస్థితి లేదా? అంటే ఉందన్న విషయం అందరికి తెలుసు. కానీ.. అడిగే అవకాశం ఇవ్వని ప్రత్యేకత కేసీఆర్ సొంతం.
తెలంగాణ సాధన తర్వాత.. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల వరకూ కేటీఆర్.. హరీశ్ ల విషయంలో బ్యాలెన్స్ గా ఉన్న కేసీఆర్.. ఆ తర్వాత నుంచి ఆయన కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా ఆయన అనుకున్నట్లుగా చెబుతారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్పటం ద్వారా తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు.
కేసీఆర్ ఆశించినట్లే.. గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం ద్వారా కేటీఆర్ తన సామర్థ్యాన్ని చేతల్లో చేసి చూపించారు. ఇది మొదలు.. కేటీఆర్ కు ప్రాధాన్యతను అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు అదెంత వరకూ వెళ్లిందంటే.. కొంగరలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సంబంధించిన పనులన్నీ మంత్రి కేటీఆర్ కు అప్పగించారు. ఒక్కడికే అప్పగించకూడదన్న చెడ్డపేరు రాకూడదని అనుకున్నారో ఏమో కానీ.. మరో మంత్రి మహేందర్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు.
అప్పగిస్తే అప్పగించారు.. కానీ మొదట్నించి నమ్ముకొని ఉన్న హరీశ్ ను ఆయన్ను అభిమానించే వారి అభిమానుల మనసు నొప్పించకుండా ఉండేలా కొన్నిబాధ్యతలు అప్పగించాల్సింది. కానీ.. ఆ పని చేయని కేసీఆర్ .. కేటీఆర్ వైపే మొగ్గు చూపినట్లుగా కనిపించింది. గతంలోనూ కొడుక్కి పలు పనుల బాధ్యతను అప్పజెప్పినా.. ఏదో ఒక సమయంలో హరీశ్ కు సైతం ఎంతో కొంత బాధ్యతను ఇచ్చేవారు. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా హరీశ్ ను ఎక్కడా కనిపించే అవకాశం ఇవ్వలేదు.
కొంగర సభ వేదిక మీద కూడా హరీశ్ కు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పలేదు. చివరకు.. హెలికాఫ్టర్ లో వచ్చే కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ కు బాధ్యత ఇచ్చారే తప్పించి.. ఆయనతో పాటు హరీశ్ కు ఉండే అవకాశాన్ని ఇవ్వలేదు. బహిరంగ సభను నిర్వహించే బాధ్యతను ఇవ్వనప్పటికీ.. స్వాగతం పలికే విషయంలో కొంతైనా సానుకూలంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో హరీశ్ ను పక్కన పెట్టినప్పటికీ సానుభూతి ఇప్పటి మాదిరి వెల్లువెత్తలేదన్న మాట చాలామంది చెబుతున్నారు. ఇలాంటి అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు ఇస్తున్నారు అన్నదే ఇప్పడున్న ప్రశ్నగా చెప్పక తప్పదు.