తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయనకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కానీ.. వాటిని అడిగే వారు ఉండరు. అడిగినా కేసీఆర్ చెప్పాలన్న రూల్ లేదుగా. అలాంటిది తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాల్ని వెళ్లడించారు. తన వ్యక్తిగతానికి సంబంధించిన విషయాల్ని చెప్పటం గమనార్హం.
ఏ మాత్రం అవకాశం చిక్కినా ఫాంహౌస్ కు వెళ్లే ఆయన రోజుల తరబడి ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఫాంహౌస్ కి వెళ్లిన సమయంలో మూడు.. నాలుగు రోజులు కూడా ఉండిపోవటం.. అన్నేసి రోజులు ఆయనేం చేస్తారన్న అంశంపై ఆసక్తి ఉంది. ఇదే విషయాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించినప్పుడు.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటేమిటంటే.. ఫాంహౌస్ తన ఇల్లు అని.. తాను అక్కడ వ్యవసాయం కూడా చేస్తుంటామని.. అది ఫాంహౌస్ ఎంతమాత్రం కాదనటం విశేషం.
హైదరాబాద్ కు దగ్గరగా ఉంటే తన ఇల్లు(ఫాంహౌస్) సైతం తాను ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. తన ఇంటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ పనులు కూడా చేస్తుంటానని.. తాను లగ్జరీ కోసం వెళ్లటం లేదని తన మీద వచ్చే విమర్శలకు బదులన్నట్లుగా తన వాదనను వినిపించటం గమనార్హం. సో.. ఇక నుంచి ఫాంహౌస్ అని ప్రస్తావించే వారంతా.. కేసీఆర్ ఇల్లు అని రాయాలా..?