`తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాన్చివేత దోరణికి చెక్ పెట్టనున్నారు. ఇప్పటివరకు పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులు - పార్టీ పోస్టుల విషయంలో ఇక జాప్యం ఉండబోదు. ఇటు ప్రభుత్వంలోని ఖాళీలు, అటు నామినేటెడ్ పోస్టుల భర్తీని కేసీఆర్ పూర్తి చేయనున్నారు. సంక్రాంతి పండగ సందడి ముగియడమే ఆలస్యం` అంటూ తన సన్నిహిత వర్గాల ద్వారా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పించిన లీకుల పర్వం మరోమారు నవ్వులపాలైనట్లుగానే ఉందని చర్చ జరుగుతోంది. గులాబీ దళపతి తీరుపై ఆ పార్టీలోని కొందరు నేతల్లో అసహనం పెరుగుతోందని రాజకీయవర్గాలు అంచనావేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఇటు ఉద్యమకారులు, అటు పార్టీలో చేరిన నేతలు ఆశపడ్డారు. అయితే వారికి నిరీక్షణే మిగిలింది. దీంతో పెద్ద ఎత్తన అసంతృప్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో 2017లో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమర్థులైన వారికి పదవులను కట్టబెట్టి కమిటీల ప్రక్రియను పూర్తిచేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. జిల్లాస్థాయి పోస్టుల భర్తీకోసం ఆయా ఎమ్మెల్యేలతో సంప్రదించి మంత్రులు.. పార్టీ కమిటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ జాబితాను అందించాలని సీఎం కేసీఆర్ కోరారు.. దీంతో మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి - ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి - టీఎస్ ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి కమిటీల తుది కసరత్తుపై చర్చించారు.
అయితే ఈ కమిటీకి ఇచ్చిన ప్రతిపాదరలు దాదాపుగా బుట్టదాఖలు అయ్యాయి తప్ప పదవులు భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి ముందు గులాబీ దళపతి కేసీఆర్ ను ఉటంకిస్తూ ఆ పార్టీ ముఖ్యనేతలు మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. అయితే...ఆ హామీ కూడా నిలపుకోలేదు. రాష్ట్ర - జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టులను భర్తీ ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను వేసినా వాటిలో డైరెక్టర్లను నియమించకపోవడంతో వాటికోసం ఎదురుచూస్తున్నవారు, జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ డైరెక్టర్ల నియామకాల కోసం ఆశపడుతున్నవారు... చకోరపక్షిలా...గులాబీ దళపతి హామీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు.