తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో అనూహ్య కామెంట్లు చేశారు. టీఆర్ ఎస్ ఓటమి గురించి అసలేమాత్రం ప్రసత్ఆవించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. పార్టీ నేతలకు కూడా చెప్పేశారు. అయితే దాన్ని తనదైన శైలిలో వివరించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష సమావేశం సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ రాజకీయాల్లో పోషించనున్న పాత్ర - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం - రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం వివరించారు. రాష్ట్రంలో 2019లో జరుగబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ 106 సీట్లు ఖాయంగా గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ తిరిగి సీట్లు ఇస్తామని, ఇందులో ఎవరు అపోహ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, నోరు అదుపులో ఉంచుకోవాలని, అలా ఉంచుకోలేని ఒకరిద్దరికి సీట్లు దక్కకపోవచ్చని తెలిపారు.
రెండు జాతీయ పార్టీలు ప్రజావసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా కేవలం 40 వేల టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని, ఇంకా 30 వేల టీఎంసీలు వాడుకోవడంలేదని పేర్కొన్నారు. మన పొరుగుదేశమైన చైనాలో 2400 కిలోమీటర్లు పైపులైన్ వేసుకొని సాగునీటిని అందిస్తున్నారని, ఆ దేశంతో పోలిస్తే అభివృద్ధిలో ఎంతో వెనుకబడిఉన్నామని వెల్లడించారు. ఒకప్పుడు మనకంటే వెనుకబడి ఉన్న దేశం నేడు ప్రపంచంలోనే అమెరికా తరువాతి అగ్రరాజ్యంగా ముందుకెళ్తున్నదని, మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి మీ అందరి మద్దతు అవసరమని అన్నారు. దీనికి శాసనసభాపక్షం మొత్తం హర్షధ్వానాల మధ్య ఏక్రగీవంగా మద్దతు తెలిపింది. మేమంతా మీ వెంటే ఉంటామంటూ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రకటించారు.
దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి, గుణాత్మకమైన మార్పే ఎజెండాగా.. జాతీయ రాజకీయాల కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘మనది థర్డ్ ఫ్రంట్ కాదు.. మొదటి ఫ్రంట్ మనదే అవుతుంది. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రజల అవసరాలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయి’ అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అందరి మద్దతుతో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పారు. రిజర్వేషన్లను పెంచుకునే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని కోరుతూ త్వరలో ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు ఇప్పటికే పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇక్కడితోనే వదిలివేయబోమని స్పష్టంచేశారు. ఫెడరల్ ఫ్రంట్ సమీకరణాలు, దేశవ్యాప్తంగా కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాకుండా సమస్యల ప్రాతిపదికన ఫ్రంట్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ప్రజలే లక్ష్యంగా ప్రజల ఎజెండాతో ఫ్రంట్ ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు.