తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు తనలోని సామాజిక స్పృహను పంచుకున్నారు. వరకట్నంపై - వివాహం చేసుకునే సమయంలో అయ్యే హడావుడి గురించి కేసీఆర్ వివరించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో గిరిజన ప్రజాప్రతినిధులు - వివిధ తెగలకు చెందిన గిరిజనులు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్ర గిరిజనులు కలిసిమెలిసి అభివృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలువాలని సీఎం కే చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గిరిజన పంచాయతీల ఏర్పాటుతో వారికి సాధికారత లభిస్తుందని చెప్పారు. సబ్ ప్లాన్ కింద ఐదేండ్లలో రూ.50 వేలకోట్ల నిధులు వస్తాయని - మూడువేల సర్పంచ్ పోస్టులు లభిస్తాయని పేర్కొన్నారు. గిరిజనులు నాయకులుగా ఎదిగేందుకు అద్భుతమైన అవకాశం తలుపు తడుతున్నదని అన్నారు.
వివాహ ఖర్చుకు పద్ధతి పెట్టుకోవాలని, యువకులు కట్నం అడుగడం మానుకోవాలని సీఎం కేసీఆర్ హితవు చెప్పారు. `కల్యాణలక్ష్మికి రూ.లక్షా నూటపదిహేను వందలు ఇస్తున్నాం. కేసీఆర్ లక్ష ఇస్తున్న సమయంలో మీరేం ఇస్తున్నారు?` అని వివాహ సమయంలో కొందరు అడుగుతున్నట్టు తెలిసింది. కట్నం అడుగొద్దు. పేదింటి ఆడిపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఈ సాయం చేస్తోంది. ఇంత లోపలే పెళ్లి జరగాలి.. అని ప్రతి తండాలో పద్ధతి రావాలి` అని కేసీఆర్ ఆకాంక్షించారు. `ఇది అద్భుతమైన అవకాశం. గిరిజనులు కూడా నాయకులుగా ఎదుగాలి. గెలువాలి. సుమారు మూడువేల గిరిజన ఆవాసాలు ఉన్న గ్రామాలలో సబ్ ప్లాన్ పూర్తిగా అమలుకావాలి. గిరిజన కుటుంబాల సంఖ్య - భూమి - పూర్తి వివరాలను ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రభుత్వం ముందు పెట్టి శాసనసభ ద్వారా గిరిజనుల అభివృద్ధికి నివేదికలు రూపొందించేలా కృషి జరగాలి. మీకు అనుకూలమైన ప్రభుత్వం. అవకాశం ఉన్నా ఉపయోగించుకోకుంటే తప్పు మీదవుతుంది. మనకు కష్టమొస్తే పక్కింటోళ్లు తీర్చలేరు. ఎవరో వచ్చి చేస్తారని కాకుండా కచ్చితంగా మనం బాగుపడాలని మనం అనుకుంటే.. కష్టపడి పనిచేయాలి` అని సీఎం కేసీఆర్ కోరారు.
తెలంగాణ ఎక్కువశాతం గిరిజనులున్న రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెప్పారు. `ఎస్టీలకోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ ఏడాదికి కేటాయించిన డబ్బు ఖర్చు చేయకుంటే వచ్చే ఏడాదికి పెట్టాలని నిర్ణయించాం. గతేడాది తొమ్మిదివేల కోట్లు పెట్టాం. ఈ ఏడాది కూడా 10 వేలకోట్లు బడ్జెట్ పెట్టాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ట్రైబల్ సబ్ ప్లాన్ అమలు కావాల్సిందే. అయిదేండ్లలో సబ్ ప్లాన్ కింద గిరిజనులకు కేటాయించే డబ్బు రూ.50 వేల కోట్లు.. అందులో 75% వస్తాయి. ఐదేండ్లలో గిరిజనుల కోసం రూ.35 వేల కోట్ల వరకు ఖర్చుపెడితే గిరిజనుల్లో ఇంక పేదరికం ఎందుకుంటది?` అని కేసీఆర్ ప్రశ్నించారు.