కవర్ చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతనే. కొడుకును ప్రమోట్ చేసుకోవాలన్న లక్ష్యంతో గ్రేటర్ ఎన్నికల ప్రచార పగ్గాల్ని కేటీఆర్ కు అప్పగించిన విషయం తెలిసిందే. గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్న విషయంలో మరో మాట లేకపోవటం.. కొడుకు సత్తా చాటేందుకు గ్రేటర్ కు మించి మరో వేదిక ఉండన్న ఉద్దేశ్యంతోనే.. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు వీలుగా గ్రేటర్ ప్రచార బాధ్యతను మరెవరికీ ఇవ్వకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ కేసీఆర్ తీరును కాస్త ప్రత్యేకంగా చెప్పాలి. గ్రేటర్ మేయర్ గా ఎవరిని ఎంపిక చేస్తున్నారు? మహిళలకు అవకాశం ఇస్తారా? లాంటి ప్రశ్నల్ని మీడియా ప్రతినిధులు సంధించిన సందర్భంలో కేసీఆర్ చాలా తెలివిగా స్పందించారు. మేయర్ పదవిని ఎవరికి అప్పగించాలన్నది కేసీఆర్ ఒక్కడు డిసైడ్ చేస్తే సరిపోదని.. దానికి ఒక కమిటీ వేస్తామని.. వారు ఆలోచించి.. చర్చించి.. నిర్ణయం తీసుకుంటారని.. కలెక్టివ్ గానే తాము పని చేస్తున్నట్లుగా కలర్ ఇచ్చారు.
నిజంగానే కేసీఆర్ అలాంటి ధోరణితోనే ఉంటారా? అన్న విషయాన్ని చూస్తే కాస్తంత ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే.. ప్రతి విషయంలోనూ అందరం కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేటట్లు చెప్పుకున్న కేసీఆర్ మాటల్లో నుంచి గ్రేటర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైనాన్నిచూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. సమిష్టిగా పని చేయటమే నిజమైతే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొత్తంలోకేటీఆర్ తప్పించి మరేనేత ఎందుకు కనిపించటం లేదు? అప్పుడప్పుడు.. అక్కడక్కడా నేనూ ఉన్నానంటూ కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ అయిన కవిత కనిపిస్తున్నారు. వీరిద్దరూ మినహా మరే టీఆర్ఎస్ నేత కనిపించరన్న విషయం అర్థమవుతుంది.
మేయర్ ఎంపిక విషయంలో తానెంత విశాల దృక్ఫదంతో వ్యవహరిస్తానన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్.. మరి.. అంతే విశాలంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతల్ని ఎందుకని ఇన్ వాల్వ్ చేయరో అర్థం కాదు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తేనే తెలుస్తుంది.. కేసీఆర్ మాటకు అర్థాలే వేరులేనని. కాదంటారా?