హరితహారం...తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం. ఆకుపచ్చ తెలంగాణ కోసం కలలు కంటున్న కేసీఆర్ ఈ క్రమంలో ప్రారంభించిన బృహత్తరమైన ప్రాజెక్టు ఇది. భారీ స్థాయిలో మొక్కలు నాటి సంరక్షించి తెలంగాణలో పచ్చదనం పెంచాలనేది కేసీఆర్ కోరిక. అయితే సాక్షాత్తు ఆయన నాటిన మొక్కకే దిక్కులేకుండా పోయింది. అయితే ఈ ఘటనపై స్థానికులు ఒక వాదన వినిపిస్తుండగా...అధికారులు ఇంకో మాట చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో కరీంనగర్ జిల్లా పరిధిలోగల మానేరు జలాశయం దిగువన మహాఘని మొక్కను నాటి లాంచనంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కట్ చేస్తే తాజాగా ఆ మొక్క వాడిపోయింది. ఈ పరిణామం స్థానికులను అవాక్కు చేసింది. ముఖ్యమంత్రి నాటిన మొక్కకే అధికారులు రక్షణ కల్పించలేకపోయారని పలువురు స్థానికులు మండిపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం మరో అభిప్రాయం చెప్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ మొక్కను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. కాపలదారు సైతం ఇదే మాట చెప్పారని పేర్కొంటున్నారు.
మరోవైపు ఈ పరిణామం కలకలం రేపిన నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మొక్కను ధ్వంసం చేశారని పేర్కొంటూ ఈ ఘటనపై కాపలాదారు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 447 - 427 - 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.