తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాధామ్యాలు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రోడ్లను వదిలేసినా.. తెలంగాణకు మణిహారం లాంటి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన రోడ్లను చూస్తే వాటి దుస్థితి ఎంతన్నది ఇట్టే అర్థమవుతూనే ఉంది. మంత్రి కేటీఆర్ సైతం హైదరాబాద్ రోడ్ల విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని ఒప్పుకోవటం మర్చిపోకూడదు. నిజానికి రోడ్ల విషయంలోనూ.. డ్రైనేజీ వ్యవహారంలోనూ.. చివరకు హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపించిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అద్భుతాలు సృష్టించకపోయినా.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన పాతికనెలలు అయిన నేపథ్యంలో.. హైదరాబాద్ లోని పరిస్థితుల మెరుగుపర్చకపోవటాన్ని ఏమనాలి?
ఉద్యమ నేతగా ఉన్న సమయంలో హైదరాబాద్ మీద సమైక్య పాలకుల దుర్మార్గాల గురించి తరచూప్రస్తావిస్తూ.. హైదరాబాద్ ను భ్రష్టు పట్టించినట్లుగా చెప్పేవారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. అరవై ఏళ్ల దరిద్రాన్ని రెండేళ్లలో తీర్చటం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించొచ్చు. రెండేళ్లలో మొత్తంగా మార్చేయకున్నా.. కనీసం మార్పుకు నాలుగు అడుగులు పడినట్లుగా కూడా కనిపించటం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. రోడ్లు సరిగా లేని కారణంగా జరుగుతున్న ప్రమాదాలు.. మరణాల గురించి నిత్యం పేపర్లలో వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి స్పందించింది లేదు.
హైదరాబాద్ ట్రాఫిక్ కారణంగా నిత్యం కోట్లాది మ్యాన్ అవర్స్ నాశనమైపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కోటికి పైగా ప్రజలున్న హైదరాబాద్ నగరంలో చేసే మార్పు.. తెలంగాణలోని దాదాపు పావు వంతుమంది ప్రజల జీవితాల్లో వచ్చే మార్పుగా కేసీఆర్ గుర్తించకపోవటం దురదృష్టకర అంశంగా చెప్పాలి. అత్యవసర అంశాల మీద దృష్టి పెట్టని ఆయన.. తాజాగా తెలంగాణ వంటకాల మీద ప్రత్యేక విధానాన్ని రూపొందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శించటం ఏమిటో అర్థం కాదు.'
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వంటకాలకు తగిన గుర్తింపురాలేదని.. అందుకే.. ఇక్కడి వంటకాలు.. వాటి విశిష్ఠతను వెలుగులోకి తీసుకురావటానికి వీలుగా.. దేశ విదేశాల్లో వాటి ఘన చరిత్రను పరిచయం చేయటంతో పాటు.. వంటల రుచిని అందరికి పరిచయం చేయటానికి సాంస్కృతి శాఖ కొత్త విధానానికి రూపం ఇస్తే.. ముఖ్యమంత్రి వర్యులు అందుకు ఓకే చెప్పేశారు. తెలంగాణ వంటకాలకు దేశవిదేశాల్లో గుర్తింపు తీసుకురావొద్దని ఎవరూ చెప్పటం లేదు. వంటల మీద చూపిస్తున్న శ్రద్ధ.. ప్రజల బతుకుల మీద ప్రభావం చూపించే రోడ్ల మీద కూడా పెడితే.. ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలోకి కూరుకుపోకుండా ఉంటారు.