కన్నయ్యను కేసీఆర్ అరెస్ట్ చేయొద్దన్నారు

Update: 2016-03-26 12:09 GMT
రోహిత్.. కన్నయ్య వ్యవహారాలు తెలంగాణ అసెంబ్లీని కుదిపివేశాయి. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరుపై విపక్షాలు విరుచుకుపడిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆచితూచి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కన్నయ్య హైదరాబాద్ పర్యటనకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని.. ఆయన్ను అడ్డుకోవద్దని తాను డీజీపీతో స్వయంగా చెప్పినట్లుగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పటం గమనార్హం.

రోహిత్.. కన్నయ్య ఇష్యూల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

= పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కలిచివేసింది

= రోహిత్ దళితుడా? లేదా? అన్నది ప్రశ్న కాదు.

= వర్సిటీల్లో కక్షలు.. కార్పణ్యాలకు వేదిక కాకూడదు

= ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

= హెచ్ సీయూలో వాటర్.. కరెంట్ సరఫరా నిలిపివేత.. విద్యార్థుల మెస్ లు మూసేయటం సరికాదు

= కన్నయ్య హైదరాబాద్ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దని నేనే చెప్పా.

= డీజీపీతో పాటు హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనర్లను కూడా స్వయంగా ఆదేశాలిచ్చా.

= ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దన్నా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తన భావాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది.

= అందుకే.. హెచ్ సీయూలో కన్నయ్యను పోలీసులు అడ్డుకోలేదు. హెచ్ సీయూ సిబ్బందే అడ్డుకున్నారు.

= పోలీసులే కాదు.. హెచ్ సీయూ సిబ్బంది కూడా ఖాకీ దుస్తులే ధరిస్తారు

= పోలీసులు అనుమతించినా వర్సిటీ వీసీ అనుమతి లేకపోవటంతో కన్నయ్య వర్సిటీలోకి వెళ్లలేకపోయారు

= సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వాలని నేను చెప్పా

= ఆ సభకు పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించలేదు

= వీసీని రీకాల్ చేసే అధికారం మాకు లేదు

= వర్సిటీ హైదరాబాద్ లో ఉన్నా దాని వ్యవహారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి

= హెచ్ సీయూ ఇష్యూను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళతా. రెండు.. మూడు రోజుల్లో ఇష్యూ సెటిల్ చేస్తా.

= విద్యార్థులపై లాఠీ ఛార్జ్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటాం

= ఓయూలో ఎమ్మెల్యే సంపత్ మీద దాడి జరగటం దురదృష్టకరం.
Tags:    

Similar News