గడిచిన రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీద కూడా జరగనంత రచ్చ మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కారు మీద విమర్శలు చేసేందుకు జంకుతున్న విపక్షాలకు.. మల్లన్న సాగర్ ఉదంతం ద్వారా విపక్షాలకు కేసీఆర్ రూళ్ల కర్ర ఇచ్చిన చందంగా ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓపక్క విపక్షాలు.. మరోపక్క మేధావులు.. ఉద్యమకారులు.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. తాజాగా శనివారం సంగతే తీసుకుంటే.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శిస్తే.. అదే పార్టీ ముఖ్యనేత రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టు మీద నిరసన గళం విప్పారు. దీక్ష చేపట్టారు కూడా.
ఇదిలా ఉంటే.. మల్లన్న సాగర్ పై ప్రభుత్వం పునరాలోచించాలంటూ జస్టిస్ చంద్రకుమార్ సూచన చేశారు. ఇక.. తెలంగాణ విపక్షాలైన కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీతో సహా అన్ని పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం దాదాపు 78వేల ఎకరాలు అవసరం కావటం.. ఇందులో రైతుల నుంచి భూమిని భారీగా సేకరించాల్సిన నేపథ్యంలో.. వారికిచ్చే నష్టపరిహారం మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.
ఈ విషయం మీద ప్రభుత్వ వైఖరిపై విమర్శలు జోరు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి సీన్లోకి వచ్చేశారు. విపక్షాలకు హోల్ సేల్ గా షాకిచ్చేలా ఆయన తాజాగా ప్రకటన చేశారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావును తన వద్దకు పిలిపించుకున్న ఆయన మల్లన్న సాగర్ ఇష్యూలో జరుగుతున్న రచ్చ మీద ఆరా తీసి.. విపక్షాలకు చెక్ చెప్పేలా.. రైతుల పరిహారం గురించి సంచలన ప్రకటన చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసమీకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయటమే కాదు.. రైతులకు పరిహారం ఏ పద్ధతిలో కావాలంటే ఆ మేరకు అందిస్తామన్న ఆయన.. 2013 భూసేకరణ చట్టం లేదా జీవో 123 ఎలా కావాలంటే అలా పరిహారం అందిస్తామంటూ ఈ ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం చేయటం గమనార్హం. ఇష్యూ ప్రిస్టేజ్ అయితే.. ఎంతకైనా సిద్ధం అన్న చందంగా వ్యవహరించే కేసీఆర్.. మల్లన్న సాగర్ ఇష్యూలో రచ్చ మొత్తం సాగుతున్న రైతుల పరిహారం మీద ‘ఎలా కోరుకుంటే అలా పరిహారం ఇస్తాం’ అన్న మాటతో మొత్తం ఇష్యూను ఒక్కముక్కతో క్లోజ్ చేశారని చెప్పొచ్చు.