తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పుతూనే ఉన్నారు! ఎంత కష్టమైనా అనుకున్న పనిని అక్షరాల చేసి తీరుతానని చెప్పే గులాబీ దళపతి ఇపుడు ఆ ఖ్యాతిని పోగొట్టుకున్నవ్యక్తిగా నిలుస్తున్నారట. కేసీఆర్ మాట తప్పారని చెప్తుంది వేరెవరో కాదు... స్వయానా కేసీఆర్ సొంత పార్టీ తెలంగాణ రాష్ర్ట సమితికి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు పార్టీ నాయకులు వెంటనే నామినేటెడ్ పదవుల గురించి ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో టీఆర్ ఎస్ కు నాయకుల తాకిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఒకింత ఆలస్యంగా స్పందించారు. సుదీర్ఘ డైలమా తర్వాత దసరా వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని తీపికబురు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని కూడా వేసి...ఎవరు అర్హులు, ఏ తరహా పోస్టులకు ఎవరిని ప్రతిపాదించాలి అనే వివరాలు ఆ కమిటీకి అందజేయాల్సిందిగా కోరారు. దీంతో చోటా మోటా నాయకులు సహా ఎమ్మెల్యేలంతా ఆ ముగ్గురు మంత్రుల వద్దకు పోలోమంటూ బయల్దేరారు.
త్వరలోనే పదవుల పందేరం పూర్తవుతుందని అంతా భావించి దసరా నాడే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేసుకున్నారు. అయితే దసరా కాదు కదా ఆ తర్వాత వచ్చిన దీపావళి, నూతన సంవత్సరం, సంక్రాంతి కూడా దాటిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా అధినేత స్పందించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ అసలెందుకు ఇలా జరుగుతోందని నాయకులు చర్చించుకంటే వరుస పరిణామాలే కారణమని తేలుతోంది. దసరా తర్వాత వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక వచ్చిపడింది. ఆ తర్వాత గ్రేటర్ వేడి, ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుకోవడ వగైరా. పోనీ ఇపుడు ఫలితాలు వచ్చిన తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు ఉంటుందా అంటే నారాయణఖేడ్ బూచి చూపెడుతున్నారట. ఖేడ్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఈ పందేరం ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్... ప్రమాణస్వీకారం చేయడమే అన్నట్లుగా ఊరించి నెలలు దాటిపోతున్నా నిరీక్షణలో ఉంచుతున్నారని గులాబీ శ్రేణులు సణుక్కుంటున్నాయి.