తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరి పంచాయితీ రగులుతోంది. దీంతో వివాదం పెద్దదవుతోంది. ప్రభుత్వాల మనుగడకే ప్రశ్నార్థకంగా మారనుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీలకు తలనొప్పిగ మారనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరిధాన్యం కొనుగోలు రగడకు ఎక్కడ ముగింపు పలుకుతారో తెలియడం లేదు. రైతులకైతే తమ ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారోనని బెంగ పట్టుకుంది.
ఇన్నాళ్లు మన రాష్ట్రంలో సేకరించిన వడ్లతో బియ్యం పట్టించి రాష్ట్రానికి కావాల్సినన్ని ఉంచుకుని మిగతావి కేంద్రానికి పంపించే వారు. వారు వాటిని ఎఫ్ సీఐ గోదాముల్లో భద్రపరచేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. వచ్చే మూడేళ్ల వరకు బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయి. దీంతో కేంద్రం బియ్యం వద్దని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వమేమో కొనాలని సూచిస్తోంది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య ఇప్పుడు బియ్యం పంచాయితీ నడుస్తోంది.
గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాము బియ్యం ఇవ్వమని వడ్లే ఇస్తామని కేంద్రానికి చెబుతూ సంతకం కూడా చేశారని కేంద్రం చెబుతోంది. దాని ప్రకారమే వడ్లు ఇస్తే కొంటామని కేంద్రం చెబుతుంటే రాష్ట్రం మాత్రం తాము బియ్యమే ఇస్తామని చెబుతోంది. అది కూడా ఉప్పుడు బియ్యం. దీంతో కేంద్రం బియ్యం తీసుకునేందుకు ససేమిరా అంటోంది. రాష్ట్రమేమో కొనకపోతే రైతులకు ఇబ్బందులు వస్తాయని చెబుతోంది. దీనిపై కొద్ది రోజులుగా మాటల యుద్ధమే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఉప్పుడు బియ్యం వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. తమకు వద్దని కేంద్రం కొనాలని రాష్ట్రం పంచాయితీ పెడుతున్నాయి. దీనిపై రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క పంట చేతికొస్తున్న సందర్భంలో ఇప్పుడెలా అని మథనపడుతున్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్యలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ధాన్యం కొనుగోలు చేయకపోతే మాకు ఏ గతి అని అంతర్మథనంలో పడిపోతున్నారు.
తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న క్రమంలో వరిధాన్యం కొనుగోలు అంశం గొడ్డలిపెట్టుగా మారనుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న సందర్భంలో ఇప్పుడు వరి పంచాయితీ కొంత ముప్పు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఏ నిర్ణయంతీసుకుంటుందో తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ కు ధాన్యం కొనుగోలు అంశమే ప్రధాన శత్రువుగా మారుతోందనేది నిర్వివాదాంశమే.