తన ముద్రను కోట్లాదిమంది పై వేసే ధోరణి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తుంటుంది. మరి.. అలాంటి కేసీఆర్ మీదనే ప్రభావం చూపించటం అంత చిన్న విషయం కాదు. అంతేకాదు.. ఒక విషయం మీద తానో అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. దాన్ని మార్చుకునే ధోరణికి కేసీఆర్ వ్యతిరేకం. కానీ.. తాజాగా ప్రధాని తీసుకున్న పెద్ద నోట్లఇష్యూలో మాత్రం ఆయన తీరు మారిపోవటమే కాదు.. గతంలో తాను వెల్లడించిన ఆందోళనలకు భిన్నంగా ఇప్పుడాయన మాటలు ఉండటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.
తాజాగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్.. నోట్ల రద్దు.. తదనంతర పరిణామాలపై ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తే.. కేసీఆర్ పై ప్రధాని మోడీ ముద్ర ఎంతమేర ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. నల్లధనం లేని.. అవినీతి రహిత భారతావనికి తెలంగాణ రాష్ట్ర మద్దతు ఉంటుందని చెప్పటం ద్వారా.. మోడీ షురూ చేసిన రద్దుకు తన సంపూర్ణ మద్దుతు ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ తేల్చేశారని చెప్పాలి. ప్రధాని తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటానికి వీల్లేదన్న ఆయన.. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థతుల్ని చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఉప సంఘాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలతో లాభం జరుగుతుందని.. ఇదో పెద్ద సంస్కరణ కార్యక్రమంగా కేసీఆర్ అభివర్ణించటం చూస్తుంటే.. మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఇందుకు తగ్గట్లే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాల్ని కేసీఆర్ వెల్లడించారు. నగదురహిత లావాదేవీల్ని నిర్వహించేందుకు వీలుగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పిన కేసీఆర్.. రూ.500 వరకే నగదుతో లావాదేవీలు కల్పించే అవకాశం కల్పిస్తామన్నారు.
ఈ విధానంలో తమకు ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పుకొచ్చారు. నగదు రహిత లావాదేవీల్ని పెంపొందించేందుకు వీలుగా తెలంగాణ ఐటీ శాఖ అధ్వర్యంలో టీఎస్ వ్యాలెట్ ను ఆవిష్కరిస్తామన్న మాటను కేసీఆర్ చెప్పుకొచ్చారు. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. ఈ వ్యాలెట్లపై విధించే ఎండీఆర్ ను ఎత్తివేయాలని ప్రధానిని కోరినట్లుగా కేసీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు లేని వారికి అకౌంట్లు తెరిపించి.. బ్యాంకు లావాదేవీలు జరిగేలా ప్రోత్సహిస్తామన్న కేసీఆర్.. మూడు నాలుగు గ్రామాలకు ఒక బ్యాంకు ఉండేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరినట్లుగా చెప్పారు. ఇక.. నగదు రహిత లావాదేవీలకోసం భారీ ఎత్తున స్వైపింగ్ మెషీన్లు అవసరమన్న కేసీఆర్ ఆసక్తికరమైన విషయాన్నిచెప్పారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికి 14.5లక్షల స్వైపింగ్ మెషిన్లు ఉన్నాయని.. నగదు రహిత లావాదేవీల్ని నిర్వహించటానికి దేశ వ్యాప్తంగా 10 కోట్ల స్వైపింగ్ మెషిన్లు అవసరమవుతాయన్న అంచనాను చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/