కేసీఆర్ కు ఎందుకు సడన్ గా ‘పీవీ’ గుర్తొచ్చాడు?

Update: 2020-06-24 14:30 GMT
భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం భారతరత్న. దేశం కోసం సర్వం ధారపోసిన వ్యక్తులకు ఈ అత్యున్నత అవార్డ్ వస్తుంది.తాజాగా ఈ భారతరత్నను తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీ నరసింహారావు దేశం చరిత్రను మార్చి ఆర్థికపునాదులు వేశాడని.. ఆ అవార్డుకు అర్హుడని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం- రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుందని అన్నారు. ఈ విషయంలో  తాను వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్రమోడిని కలుసుకుంటానని, పివికి భారత్ రత్నను ప్రదానం చేయాలని అభ్యర్థిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

తాజాగా పివి జయంతి శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన  సీఎం కేసీఆర్ ఆయన జయంతి వేడుకలకు రూ .10 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.పివి అనేక రంగాలలో బహుముఖ వ్యక్తిగా చేసిన గొప్ప సేవలను గుర్తుంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.పివి జన్మదినం జూన్ 28న హైదరాబాద్‌లోని పివి జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50 ప్రదేశాలలో వేడుకలు జరుగుతాయి.

పివి  ఐదు కాంస్య విగ్రహాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరా,  ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేయాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రాజ్యసభ ఎంపీ కేశవ రావు నేతృత్వంలో కేసీఆర్ శతాబ్ది ఉత్సవాల కమిటీ నియమించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీలను శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించాలని ఆయన కోరారు.

పీవీ శతజయంతి ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ పట్టించుకోని ఈ తెలంగాణ యోధుడిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సోనియా గాంధీ సహించని పీవీని కేసీఆర్ నెత్తిన పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయబోతున్నారు. ప్రధాన ప్రతి పక్షం తమ పార్టీకే చెందిన పీవీ జయంతి ని చేస్తుందా? చేయక పోతే ఆ పార్టీ పై విమర్శలు.. చేస్తే సోనియా తో ఇబ్బందులు.. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నే కాదు.. జాతీయ కాంగ్రెస్ ను కూడా పీవీ అస్త్రంతో కొట్టబోతున్నాడు కేసీఆర్. మోడీ కూడా ఈ సమావేశానికి వస్తే.. పీవీ చరిత్ర తవ్వితే కాంగ్రెస్ బండారం బయట పడుతుంది. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న స్ట్రాటజీ తోనే పీవీకి భారత రత్న డిమాండ్ ను కేసీఆర్ తెచ్చాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News