సర్వేలన్నీ అనుకూలంగా ఉండడంతో మంచి ఊపు మీదున్న తెలంగాణ సీఎం జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత చేపట్టిన ముఖ్యమైన పథకాలన్నీ ఒక రూపానికి రావడంతో ఇక జనంలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇందుకోసం జిల్లాల్లో బస్సు యాత్రలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. పనిలోపనిగా ప్రాజెక్టులనూ సందర్శించబోతున్నారు. ఇలాంటి ఫీల్ గుడ్ వాతావరణంలోనే జనంలోకి వెళ్లాలన్నది ఒక ఆలోచన అయితే... తన పర్యటన వెనుక ఇంకో కారణం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.. చాలాకాలంగా కేసీఆర్ ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలున్నాయి. పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా కూడా ఇంకా అనేక అనుమాలు మాత్రం మిగిలిపోయాయి. కేసీఆర్ ఒకప్పటి తన అలవాట్ల కారణంగా బాగా బలహీనపడిపోయారని.. అందుకే ఫాం హౌస్ లో ప్రకృతి మధ్య గడుపుతూ చికిత్స తీసుకుంటున్నారన్న వాదనలూ ఉన్నాయి. ఇకపై దీంతో ఆయన జనంలోకి వెళ్లి అనుమానాలు పటాపంచలు చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. తన హయాంలో సాధించిన విజయాలపై కేసీఆర్ నివేదిక రూపొందిస్తున్నారు. డిసెంబర్ రెండవ తేదీన సికిందరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రెండున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బహిరంగ సభలో ప్రజలకు వివరిస్తారు. ఆ తరువాత టిఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల పరిశీలన, క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావాన్ని కూడా పరిశీలిస్తారు.
అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో సందర్శించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. హెలికాఫ్టర్ వెళ్లలేని ప్రాంతాలకు స్వయంగా స్కూటర్‌పైనైనా వెళతానని ప్రకటించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తరువాత పాలమూరు ఎత్తిపోతల - కాళేశ్వరం రెండు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో కరవును శాశ్వతంగా పారద్రోలవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో పాపులర్ ముఖ్యమంత్రుల్లో వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొదటి స్థానంలో నిలిచారు. పెట్టుబడులను ఆకర్శించడంలో - రియల్ ఎస్టేట్ బూమ్ లో రాష్ట్రం గత రెండేళ్లలో దూసుకెళుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు పారిశ్రామిక రంగంలోనూ ముందున్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా 44వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా - పరోక్షంగా మొత్తం ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది. ఐటి రంగంలోనూ తెలంగాణ లక్ష కోట్ల రూపాయల ఎగుమతులకు చేరుకొంది. అనేక ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా బహిరంగ సభ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. 2019 ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని ముందస్తుగానే సిద్ధం చేసే విధంగా బహిరంగ సభ - కేసీఆర్ యాత్ర ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/