రాజకీయ ఎత్తులు.. ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టే వ్యూహాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత నేర్పరి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే తన సామర్థ్యాన్ని ఆయన ప్రదర్శించుకున్నారు. గులాబీ బాస్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన నేతలంతా ఏదో ఒక రోజు పార్టీ నుంచి వీడిపోవాల్సిందే.. లేదంటే అవమానాల్ని ఎదుర్కోవాల్సిందే అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలె నరేంద్ర మొదలు విజయశాంతి వరకు.. అంతదాకా ఎందుకు.. ఉద్యమ సమయంలో కీలకభూమిక పోషించిన ఈటెల కానీ.. పద్మారావు గౌడ్ కానీ.. ఈ రోజున వారి పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఉండరు. కాలం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటమే కాదు.. రాజకీయ సమీకరణాల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఈటలను గులాబీ పార్టీ నుంచి పంపించే ప్రోగ్రాం మొదలైనట్లే. తదుపరి చర్యలు మొత్తం ఒక వ్యవధిలోపు పూర్తి కావటం ఖాయం. ఇది తప్పా? ఒప్పా? అన్నది ప్రశ్నే కాదు. ఎందుకంటే.. రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలన్ని ఏ ఒక్క కారణంతోనే జరగవు. దాని వెనుక చాలానే అంశాలు ఉంటాయి.
ఇవాల్టి రోజున ఈటల మీద వచ్చిన ఆరోపణలు.. అందుకు కేసీఆర్ స్పందించిన తీరును చాలామంది తప్పు పట్టొచ్చు. కానీ.. అలా తప్పు పట్టే వారిలో ఏ ఒక్కరినైనా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఫాంహౌస్ కు పిలిపించి.. తన వెర్షన్ చెబుతూ ఓపెన్ అయితే.. కేసీఆర్ నిర్ణయం తప్పుకాదనిపించొచ్చు. అదే సమయంలో.. అదే వ్యక్తిని రాజేందర్ పిలిపించి.. జరిగిన పరిణామాల గురించి మనసు విప్పి మాట్లాడితే.. ఆయన వెర్షన్ సబబుగా అనిపించ వచ్చు. ఇక్కడ చెప్పాలనుకుంటున్నదేమంటే.. ఎవరికి వారు తమ వరకు తాము తప్పు చేస్తున్నట్లుగా అనుకోవటానికి ససేమిరా అనటమే కాదు.. తమ వాదనతో ఎదుటివారిని కన్వీన్స్ చేసే సత్తా సొంతమని చెప్పాలి. అందుకే.. జరిగిన దాన్లో తప్పొప్పుల గురించి వెతకటం అనవసరం.
కాకుంటే.. ఇప్పుడున్న కరోనా ప్రత్యేక పరిస్థితుల వేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ మొదలెట్టిన ఆట సమయం సరికాదని చెప్పాలి. ఇవాల్టి రోజున అధికారులు ఎన్ని చెప్పినా..తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బెడ్ దొరకాలంటే గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందుకోసం పెద్ద ఎత్తున సిఫార్సులు చేసినా లభించని పరిస్థితి. ఆక్సిజన్ బెడ్లు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే. ఒక విధంగా తెలంగాణవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది.
ఇలాంటివేళలో బాధ్యత కలిగిన ప్రభుత్వం తన ఫోకస్ అంతా ప్రజలు పడుతున్న బాధల మీదా.. వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉండాలే తప్పించి.. రాజకీయ ప్రయోజనాల గురించి క్షణం కూడా ఆలోచించకూడదు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ కు తన ప్రత్యర్థుల పీచమణచటం కావాలి. రేపు వెల్లడయ్యే ఫలితాల్లో నాగార్జునసాగర్ సీటులో విజయం సాధించబోతున్నారు.
అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించటంతో పాటు.. రాష్ట్రంలో అధికారపక్షం తిరుగులేని రాజకీయ శక్తిగా రుజువు కానుంది. ఇలాంటి బలమైన వేళలో.. తన ప్రత్యర్థుల్ని దెబ్బ తీయటం ద్వారా.. మిగిలిన వారందరికి తీవ్రమైన హెచ్చరికను పంపటంతో పాటు.. మరెవరూ నోరు మెదపకుండా.. తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలన్న తలంపు స్పష్టంగా కనిపిస్తుంది.
పాలకుడికి ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నా లేకున్నా.. వారంతా తీవ్ర సమస్యలతో కిందామీదా పడుతున్న వేళ.. వారు కోలుకోవటానికి అవసరమైన సాయాన్ని అందించాలి. అలాంటి వేళలో మిగిలిన విషయాల్ని వదిలేయాలి. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనలు ఆ దిశగా సాగుతున్నాయంటారా?