తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదైనా విషయం మీద ఎవరినైనా విమర్శించాలని డిసైడ్ అయితే.. అందుకు అవసరమైన సరంజామా మొత్తాన్ని సిద్ధం చేసుకుంటారు. కరోనా వేళ టీవీలు.. పత్రికలు ప్రజల్ని ఆగమాగం పట్టించాయన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భయపెట్టి చంపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీలు.. పత్రికలకు సామాజిక బాధ్యత ఉండాలన్న ఆయన.. బ్లాక్ ఫంగస్ అని ఒకడు.. ఎల్లో ఫంగస్ అని మరొకడు.. వైట్ ఫంగస్ అని ఇంకొకడు చెప్పి చావగొట్టారని ఫైర్ అయ్యారు. ‘ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ.. సదివి జనం చస్తాండ్రు’ అంటూ మండిపడ్డారు.
వరంగల్ పర్యటనలో భాగంగా ఈ విషయాల్ని చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా ఒక పిట్టకథను చెప్పారు. ఈ మధ్యనే తనకో వ్యక్తి పెద్ద బుక్కు ఇచ్చారని.. దాన్ని తాను చదివానన్నారు. దాన్లో ఒక రాజుగారి కథ రాశారన్న కేసీఆర్ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చెబితే..
‘‘ఓ రాజ్యంలో ఎనకట గత్తర్ వచ్చి అనేకమంది చచ్చిపోతాండ్రు. ఆ రాజు వైద్యులు ప్రజలను కాపాడుకోవడానికి తిప్పలు పడ్డరు. కానీ సంజయితలేదు. మరి ఎట్లా? గక్కడ దానికి వ్యతిరేకమైన మాంత్రికుడొకడున్నడు సర్.. వాణ్ణి తీసుకొస్తే తరిమేస్తడు సర్.. అని రాజుకు చెప్పిన్రు. వాణ్ణి బతిమాలి బామాలి తోలుకొచ్చిన్రు.. వాడు ఆ రాజ్యం పొలిమేర దాటి వస్తాండు. వీడు వస్తున్నడంటేనే మహమ్మారికి భయం. వీడు ఎంటరయితున్నడు.. అది బయటకు పోతున్నది. ఇద్దరూ ఎదురుపడిన్రు. వీడు.. ‘అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి గదే నీ పాడుగాను..’ అన్నడు. అంటే ఆ మహమ్మారి.. ‘అన్నానేను చంపింది యాభై మందినే. 450 మంది దగడుకే చచ్చిపోయిండ్రు’ అని చెప్పిందట. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీల వాళ్లకు అవసరమా? దాంతో ఏం సాధిస్తరు వీళ్లు? మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలె’’ అని హితవు పలికారు.
థర్డ్ వేవ్ లో పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారంటూ వస్తున్న కథనాలపై తనదైన శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. పిల్లలకు వస్తదని చెబుతున్నారని.. ‘నీకు ఫోన్ చేసి చెప్పినాది.. ఈ తాప వచ్చి పేను పిల్లలకు పడతానని? ఎవరు చెప్పిన్రు నాకర్థం కాదు. ఇది మందిచిది కాదు. ఇలాంటి విషయాల్లో టీవీల తీరు మారాలి’ అని మండిపడ్డారు. ఇప్పటికే పిల్లలకు బడి బంద్ అయి పిచ్చి పిచ్చి చేస్తున్నారన్న కేసీఆర్.. ‘‘ముందే బడి బందై పిచ్చి పిచ్చి చేస్తన్నరు ఇండ్లపంటి. బడికి పోయొచ్చిండంటే వాడికి దోస్తుంటడు, టీచర్ ఉంటడు.. క్లాసులుంటయి.. ఆడుకుంటడు.. పొద్దు గడుస్తది.
మొత్తానికే బందైతే వాళ్లకు ఏంచేయాల్నో అర్థంకాదు. ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు. గిట్ల ఉన్నది కథ’’ అంటూ తనదైన ఫ్లోలో విరుచుకుపడ్డారు.
థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్న థియరీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. ఈ రెండు వాదనల్ని మీడియా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఒక మహాఉత్పాతం వచ్చి పడుతున్నప్పుడు ప్రజల్ని సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.
మరణాల మీద కేసీఆర్ పంచ్ లు మామూలే. ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజమనుకుందాం. వంద మంది చనిపోతే ఐదుగురే చనిపోతారని ప్రచారం చేద్దాం. అప్పుడేం జరుగుతుంది. ఈ మాత్రం దానికి ఎందుకంత హడావుడి చేయటం అంటూ ఇష్టారాజ్యంగా తిరిగితే వైరస్ మరింత ప్రబలిపోతుంది కదా? ప్రపంచంలోని చాలా దేశాలే కాదు.. మనకు కాస్త దూరంలో ఉన్న కేరళ లాంటి రాష్ట్రాలు సైతం మరణాలు..కరోనా బారిన పడిన వారి వివరాల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఎందుకు చెబుతున్నట్లు? వారికి ఈ పిట్టకథ గురించి తెలియకనా? వాస్తవాలు చెబితే భయంతో చస్తారని చెప్పే కేసీఆర్.. అవేమీ చెప్పకుండా అంతా సుభిక్షంగా ఉందని చెబితే.. నిర్లక్ష్యంతో వైరస్ బారిన పడి చనిపోరా? ఆ అవకాశం లేదంటారా?