పండగలకు.. పబ్బాలకు భారీగా ఖర్చు చేసే అలవాటున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా పర్వదినమైతే చాలు.. భారీగా నిదుల్ని విడుదల చేస్తామంటూ ప్రకటన చేయటం తెలిసిందే. వారూ వీరూ అన్న తేడా లేకుండా పండగల విషయంలో ఉదారంగా వ్యవహరించే కేసీఆర్ తాజాగా ముస్లింల రంజాన్ పండుగను భారీగా ప్లాన్ చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసే కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించటం కోసం ఏకంగా రూ.14కోట్లు ఖర్చు చేయటం గమనార్హం.
పేద మైనార్టీలకు ఆటో రిక్షాల పంపిణీతో సహా పలు కార్యక్రమాల్ని నిర్వహించాలని డిసైడ్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. ఇవి కాకుండా రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే విందు కార్యక్రమాల కోసం రూ.14కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో రూ.10కోట్ల మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 2 లక్షల మంది ముస్లింలకు దుస్తుల పంపిణీ కోసం సిద్దం చేశారు. గులాబీ సంచిలో ఈద్ ముబారక్ అంటూ.. ఉర్దూ.. తెలుగు.. ఇంగ్లిష్ భాషల్లో రాయటమే కాదు.. రంజాన్ గిఫ్ట్ అంటూ పెద్ద అక్షరాలతో అచ్చేశారు. ఈ సంచుల్ని రాష్ట్రంలోని 2 లక్షల మంది ముస్లింలకు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నగరంలోని వంద మసీదుల దగ్గరా.. రాష్ట్రంలోని మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 95 మసీదుల దగ్గర ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే కాకుండా రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కోసం రూ.4 కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయటం గమనార్హం. సర్కారు అనుకోవాలే కానీ.. నిధుల విడుదలదేముంది..?