ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనూహ్య రీతిలో తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జరుగుతున్న హోరాహోరి ఎన్నికల నేపథ్యంలో ఆయన తన సర్వే ఫలితాలను వెల్లడించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లగడపాటి... తన సర్వేపై కొంత లీక్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపే ప్రజలు మొగ్గు చూపుతారని వెల్లడించిన మాజీ ఎంపీ... తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని... నారాయణ్ పేట్ - భోథ్ లో ఇండిపెండెంట్లు గెలుస్తారని వాళ్ల పేర్లను కూడా ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్వహించిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అన్ని పార్టీలను అలర్ట్ చేసింది.
సహజంగానే ఈ సర్వేపై అధికార టీఆర్ ఎస్ పార్టీ స్పందనపై అందరి దృష్టి పడింది. ప్రధానంగా గులాబీ దళపతి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎలా రియాక్టవుతారనే చర్చ జరుగుతున్న సమయంలో లగడపాటి సర్వేపై తీవ్రంగా సీఎం కేసీఆర్ స్పందించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... లగడపాటి సర్వే ఓ వెకిలి సర్వే అంటూ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో శాపాలు పెట్టినవాళ్లు సర్వేలు అంటూ లీకులు చేస్తున్నారని.. అది అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసిన గులాబీ దళపతి... ఆ సన్నాసులు కొన్ని వెకిలి మకిలి పిచ్చి సర్వేలు అంటూ ఏవో లీక్ లు ఇస్తున్నారని... వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. `కాంగ్రెస్-టీఆర్ ఎస్ చెప్పింది విని ఏది నిజమో ఆలోచించి ఓటేయండి. గత్తర గత్తర ఓటేస్తే.. వచ్చే ఐదేండ్లు కూడా గత్తర గత్తరనే ఉంటుంది. కాబట్టి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందున్నది. అభివృద్ధిని చూసి ఓటేయండి`` అని కేసీఆర్ కోరారు.